ఉక్కు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రెండు రోజుల పర్యటన నిమిత్తం తిరుపతి చేరుకున్న కేంద్ర ఉక్కు శాఖ మంత్రి శ్రీ రామ్ చంద్ర ప్రసాద్ సింగ్


హోటల్ తాజ్ లో నిర్వహిస్తున్న కాన్సులేటివ్ కమిటీ మీటింగ్ కు అధ్యక్షత వహించనున్న మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 30 JUN 2022 5:28PM by PIB Hyderabad

తిరుపతి, 30,జూన్,2022

రెండు రోజుల పర్యటన నిమిత్తం  కేంద్ర ఉక్కు శాఖ మంత్రి శ్రీ  రామ్ చంద్ర ప్రసాద్ సింగ్ తిరుపతి చేరుకున్నారు.  ఈ రోజు రాత్రి తి.తి.దే (తిరుమల) లో బస చేస్తారు. రేపు  ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి  వారి దర్శనానంతరం తిరిగి తిరుపతి చేరుకుంటారు. రేపు సాయంత్రం 05 : 00 గంటలకు  తాజ్ హోటల్ లో నిర్వహిస్తున్న కాన్సులేటివ్ కమిటీ మీటింగ్ కు  అధ్యక్షత వహించనున్నారు. అనంతరం విమానంలో హైదరాబాద్ బయలుదేరి వెళతారు.

 




***


(రిలీజ్ ఐడి: 1838252) సందర్శకుల సూచీ సంఖ్య : : 167