రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
ప్రత్యేక ప్రచారం 3.0ను విజయవంతంగా పూర్తి చేసిన రసాయనాలు, పెట్రో రసాయనాల విభాగం
Posted On:
07 NOV 2023 12:21PM by PIB Hyderabad
రసాయనాలు, పెట్రో రసాయనాల విభాగం ప్రత్యేక ప్రచారం 3.0ను విజయవంతంగా పూర్తి చేసింది. రసాయనాలు, పెట్రో రసాయనాల విభాగం 2 అక్టోబర్ నుంచి 31 అక్టోబర్ 23 కాలంలో ఉత్సాహంతో ప్రత్యేక ప్రచారం 3.0ను అమలు చేసింది. దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న 258 ప్రదేశాలలో పారిశుద్ధ్య ప్రచారాలనే కాకుండా, ఈ డ్రైవ్ ఫలితంగా పార్లమెంటు సభ్యుల నుంచి స్వీకరించిన అన్ని గుర్తించిన, లక్ష్యిత సూచనలను, పిజి పోర్టల్ ద్వారా ప్రజల నుంచి అందుకున్న ఫిర్యాదులను పూర్తిగా పరిష్కరించారు.
ముందు సంవత్సరంలో రికార్డు గదిని విజయవంతంగా శుభ్రం చేసిన విభాగం, భౌతిక ఫైళ్ళను రికార్డు రూముకు తరలించడంతో పాటుగా ఎలక్ట్రానిక్ ఫైళ్ళను సమీక్షించడంపై దృష్టి పెట్టిన ఫలితంగా 5181 ఇ-ఫైళ్ళను మూసివేయగలిగింది. అందరు అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్న ఫలితంగా అటు ఎలక్ట్రానిక్, భౌతిక ఫైళ్ళను పెట్టుకున్న లక్ష్యాన్ని అధిగమించి సమీక్షించారు.
మెరుగైన పని పర్యావరణాన్ని అందించేందుకు విభాగం పని ప్రదేశాన్ని పునరుద్ధరించి, పునఃరూపకల్పన చేసింది.
స్వచ్ఛతా కార్యకలాపాలను ప్రధాన స్రవంతిలోకి తెచ్చి, వ్యవస్థీకరించే బాధ్యతను విభాగానికి చెందిన సిఐపిఇటి, ఐపిఎఫ్‌టి, హెచ్ఒసిఎల్, హెచ్ఐఎల్ (ఇండియా) లిమిటెడ్ సంస్థలు తీసుకున్నాయి. కేంద్రకార్యాలయ స్థాయిలోనూ, శాఖ/ యూనిట్ల స్థాయిలోనూ అందరూ ఈ కార్యక్రమంలో చురుకుగా పాలు పంచుకున్నారు. వారి కృషి ద్వారా 47,735 చదరపు అడుగుల స్థలం ఖాళీ కావడమే కాక తుక్కును విసర్జించడం ద్వారా రూ. 5,09,360 ఆదాయాన్ని ఆర్జించారు.
***
(Release ID: 1975531)