వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ మంత్రిగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి బాధ్యతలు తీసుకున్నారు.


80 కోట్ల మంది భారతీయులకు నేరుగా సేవలందించే ఈ మంత్రిత్వ శాఖలో సేవ చేయటం గొప్ప అవకాశం: ప్రహ్లాద్ జోషి

प्रविष्टि तिथि: 11 JUN 2024 3:22PM by PIB Hyderabad

 

వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖ మంత్రిగా అధికారికంగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి దిల్లీలో బాధ్యతలు స్వీకరించారు. వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజాపంపిణీ శాఖ మాజీ మంత్రి  పీయూష్ గోయల్ సహాయ మంత్రులు బీఎల్ వర్మ,నిముబెన్ జయంతిభాయ్ బంభానియా సమక్షంలో జోషికి బాధ్యతలు అప్పగించారు.
 

ఆహార, ప్రజా పంపిణీ శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా..వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి నిధి ఖరే‌తో పాటు మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ప్రహ్లాద్ జోషి… తనకు అవకాశం ఇచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. 80 కోట్ల మంది భారతీయులకు నేరుగా సేవలందించే ఈ మంత్రిత్వ శాఖలో సేవ చేసేందుకు అవకాశం కల్పించినందుకు ప్రధానమంత్రికి కృతజ్ఞురాలిని అని జోషి అన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఉచిత ఆహార ధాన్యాన్ని అందించే ప్రధాన పథకం పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అని… కేంద్ర మాజీ మంత్రి గోయల్‌ గుర్తించిన కార్యక్రమాలను ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో అమలు చేయడమే తన ప్రాధాన్యత అని పేర్కొన్నారు.

***


(रिलीज़ आईडी: 2024520) आगंतुक पटल : 84
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Gujarati , Tamil , Kannada , Malayalam