ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

హూల్ దివస్ సందర్భంగా గిరిజన వీరులకు ప్రధానమంత్రి నివాళులు

Posted On: 30 JUN 2025 2:28PM by PIB Hyderabad

ఆరాధనీయ ‘హూల్ దివస్’ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భారత గిరిజనుల అజేయ ధైర్యసాహసాలతో పాటు వారి అసాధారణ పరాక్రమానికి మనస్ఫూర్తిగా నివాళులు అర్పించారుచరిత్రాత్మక సంథాల్ తిరుగుబాటును ప్రధానమంత్రి స్మరించుకొంటూ సిదో-కాన్హూచాంద్-భైరవ్‌లతో పాటు ఫూలో-ఝానోలతో పాటు వలస పాలకుల పీడనకు వ్యతిరేకంగా పోరాడుతూ జీవనాన్ని త్యాగం చేసిన పూజనీయ స్వాతంత్ర్య వీరులువీరాంగనలందరి శాశ్వత వారసత్వానికి జోహార్లు అర్పించారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పొందుపరిచిన ఒక సందేశంలో ఆయన ఇలా పేర్కొన్నారు:

‘‘హూల్ దివస్ మన ఆదివాసీ సమాజంలోని అజేయ సహసంతో పాటు అద్భుత పరాక్రమాన్ని మనకు గుర్తు చేస్తుందిచరిత్రాత్మక సంథాల్ తిరుగుబాటుతో ముడిపడ్డ ఈ ప్రత్యేక సందర్భం సిదో-కాన్హూచాంద్-భైరవ్‌లతో పాటు ఫూలో-ఝానోలతో పాటు విదేశీ పాలనలో దురాగతాలకు వ్యతిరేకంగా పోరాడుతూ ప్రాణాల్ని త్యాగం చేసిన వీరులువీరాంగనలు అందరికీ మనస్ఫూర్తిగా నమస్సులువందనాలను అర్పిస్తున్నానువారి శౌర్యగాథలు దేశంలో ప్రతి తరానికీ మాతృభూమి ఆత్మగౌరవాన్ని పరిరక్షించడానికి ప్రేరణను అందిస్తూనే ఉంటాయి.’’

 

**‌*


(Release ID: 2140792)