రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జులై 1 నుంచి ప్యాసింజర్ రైలు ఛార్జీల హేతుబద్ధీకరణ అమలు


సాధారణ తరగతి టికెట్లలో 500 కి. మీ. వరకూ ఛార్జీల్లో ఎటువంటి పెంపు లేదు.. 501 కి.మీ. నుంచి 1500 కి.మీ. లోపు దూరాలకు రూ. 5 పెంపు, 1501-2500 కి.మీ. దూరాలకు రూ.10 చొప్పున పెంపు, 2501-3000 కి.మీ. ప్రయాణాలకు రూ. 15 చొప్పున ఛార్జీల పెరుగుదల

Posted On: 30 JUN 2025 6:01PM by PIB Hyderabad

రైలు ఛార్జీల క్రమబద్ధీరణ, ప్రయాణీకులకు అందించే సేవలకు ఆర్థికపరమైన స్థిరత్వాన్ని పెంపొందించే లక్ష్యంతో రైల్వే మంత్రిత్వ శాఖ ప్యాసింజర్ రైలు సేవల ప్రాథమిక ఛార్జీలను హేతుబద్ధీకరించింది. కొత్త ఛార్జీలు 2025 జూలై 1 నుంచి అమల్లోకి వస్తాయి. ఇండియన్ రైల్వే కాన్ఫరెన్స్ అసోసియేషన్ (ఐఆర్సీఏ) జారీ చేసిన తాజా ప్రయాణీకుల ఛార్జీల పట్టిక ఆధారంగా సవరించిన ఛార్జీలు ఉంటాయి.

ఛార్జీల హేతుబద్ధీకరణ  ముఖ్యాంశాలు (2025 జూలై 1 నుంచి అమలు):

సబర్బన్ రైళ్ళలో సింగిల్ జర్నీ (రిటర్న్ టికెట్ ప్రమేయం లేకుండా ఒకవైపు చేసే ప్రయాణం) ఛార్జీలు, సీజన్ టిక్కెట్లలో (సబర్బన్, నాన్-సబర్బన్ మార్గాల్లో) ఎటువంటి మార్పు లేదు.
సాధారణ  నాన్ -ఏసీ తరగతులు (నాన్-సబర్బన్ రైళ్ళు):

రెండో తరగతి: కింది షరతులకు లోబడి కిలోమీటర్ కు అర పైసా పెంపు
500 కి.మీ. వరకూ ఎటువంటి పెంపు లేదు
501 కి.మీ. నుంచి 1500 కి.మీ. లోపు దూరాలకు రూ. 5 పెంపు
1501-2500 కి.మీ. దూరాలకు రూ.10 చొప్పున పెంపు
2501-3000 కి.మీ. ప్రయాణాలకు రూ. 15 చొప్పున పెంపు
స్లీపర్ తరగతి: కి.మీ. అర పైసా పెంపు
మొదటి తరగతి : కి.మీ. అర పైసా పెంపు

నాన్-ఏసీ మెయిల్, ఎక్స్ ప్రెస్ రైళ్ళు:

రెండో తరగతి: కి.మీ. పైసా పెంపు
స్లీపర్ తరగతి: కి.మీ. పైసా పెంపు
మొదటి తరగతి: కి.మీ. పైసా పెంపు
 
మెయిల్, ఎక్స్ ప్రెస్  రైళ్ళలో ఏసీ తరగతి  ఛార్జీలు:

ఏసీ చెయిర్ కార్.. ఏసీ 3-టైర్, 3-ఎకానమీ.. ఏసీ 2-టైర్ ..  ఏసీ ఫస్ట్, ఎగ్జిక్యూటివ్, ఎగ్జిక్యూటివ్ అనుభూతి: కి.మీ. కు 2 పైసల చొప్పున పెంపు

క్లాసుల వారీగా సవరించిన ఛార్జీలు రాజధాని, శతాబ్ది, దురంతో, వందే భారత్, తేజస్, హంసఫర్, అమృత్ భారత్, మహామాన్, గతిమాన్, అంత్యోదయ, జన శతాబ్ది, యువ ఎక్స్ ప్రెస్, ఏసీ విస్టాడోం కోచులు, అనుభూతి కోచులు, సాధారణ నాన్-సబర్బన్ సేవలు సహా ప్రీమియర్, ప్రత్యేక రైలు సేవలకు వర్తిస్తాయి.

అనుబంధ ఛార్జీల్లో ఎటువంటి మార్పు లేదు:

రిజర్వేషన్ ఛార్జీలు, సూపర్ ఫాస్ట్ పేరిట వసూలు చేసే అదనపు రుసుము, ఇతర ఛార్జీల్లో ఎటువంటి మార్పు లేదు.
 
అమల్లో ఉన్న నిబంధనల ప్రకారమే జీఎస్టీ వసూళ్ళ కొనసాగింపు
 
ఛార్జీల రౌండింగ్ ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారమే కొనసాగుతుంది.
 
అమలు

సవరించిన ఛార్జీలు 01.07.2025న లేదా ఆ తర్వాత బుక్ చేసుకున్న టిక్కెట్లకు వర్తిస్తాయి. ఈ తేదీకి ముందు జారీ చేసిన టిక్కెట్లు ఎటువంటి ఛార్జీల సర్దుబాటు లేకుండా ప్రస్తుత ఛార్జీలోనే చెల్లుబాటు అవుతాయి. పీఆర్ఎస్, యూటీఎస్, ప్రత్యక్ష టికెటింగ్ వ్యవస్థలను తదనుగుణంగా నవీకరిస్తున్నారు.

సవరించిన ఛార్జీల నిర్ణయం సజావుగా అమలయ్యేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ అన్ని జోనల్ రైల్వేలకు తగిన సూచనలను జారీ చేసింది. ఇందులో భాగంగా అన్ని స్టేషన్లలో నవీకరించిన ఛార్జీల జాబితాను ప్రదర్శించాలని ఆదేశించింది.

సవరించిన ఛార్జీల పట్టికను వీక్షించేందుకు ఇక్కడ చూడండి: Click Here

 

***


(Release ID: 2140953)