ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గత 11 ఏళ్ళలో ఒడిశా రైల్వేలు సాధించిన ప్రగతిని ప్రముఖంగా ప్రస్తావించిన ప్రధానమంత్రి

Posted On: 27 JUN 2025 1:10PM by PIB Hyderabad

గత 11 ఏళ్ళలో ఒడిశా రైల్వేలు సాధించిన ప్రగతిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ప్రత్యేకంగా ప్రస్తావించారు.

 

రాష్ట్రంలోని తీర్థయాత్రా స్థలి జగన్నాథుడి పూరీ కి రైలు యాత్ర ఎంత సులభమయ్యిందో వివరిస్తూ కేంద్రమంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ రాసిన వ్యాసాన్ని శ్రీ మోదీ ఉటంకించారు.

 

‘ఎక్స్’ పై ప్రధానమంత్రి కార్యాలయ హ్యాండిల్ (పీఎంఓ ఇండియా) చేసిన పోస్ట్:

 

“ఒడిశా రైల్వే వ్యవస్థ సాధించిన చారిత్రాత్మక ప్రగతికి గత 11 ఏళ్ళు సాక్షిగా నిలిచాయి. రాష్ట్రంలో, మరీ ముఖ్యంగా మహాప్రభు ఆవాసమైన జగన్నాథ పూరీలో జరిగే రథయాత్రను తిలకించేందుకు తరలి వెళ్ళే భక్తజన సందోహానికి భారతీయ రైళ్ళలో ప్రయాణం ఎంత సులభమయ్యిందో కేంద్రమంత్రి శ్రీ @AshwiniVaishnaw  

 

https://www.hindustantimes.com/opinion/pilgrims-progress-the-railways-look-east-policy-101750953515997.html నమో యాప్ ద్వారా పేర్కొన్నారు”. .  


(Release ID: 2140981)