ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రపంచ ఇంధన ముఖచిత్రాన్ని మార్చివేస్తున్న సౌరశక్తి…. వ్యాసాన్ని పంచుకున్న ప్రధానమంత్రి
Posted On:
01 JUL 2025 12:21PM by PIB Hyderabad
అంతర్జాతీయ సౌర కూటమి (ఐఎస్ఏ) ఒక్క భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా స్వచ్ఛ ఇంధన విప్లవాన్ని సృష్టిస్తోందనీ, సౌర శక్తి ప్రపంచ ఇంధన ముఖచిత్రాన్ని మార్చివేస్తున్నదనీ చెబుతూ ఈ అంశంపై వచ్చిన వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో కేంద్ర మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషీ పొందుపరిచిన ఒక సందేశానికి ప్రధానమంత్రి కార్యాలయం స్పందిస్తూ:
‘‘ప్రపంచ ఇంధన ముఖచిత్రాన్ని సౌర శక్తి ఎలా మారుస్తున్నదీ కేంద్ర మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషీ రాశారు. అంతర్జాతీయ సౌర కూటమి (@isolaralliance) ఒక్క భారతదేశంలోనే కాక ప్రపంచమంతటా కూడా స్వచ్ఛ ఇంధన విప్లవాన్ని శరవేగంగా వ్యాప్తిలోకి తీసుకువస్తోందని ఆయన వివరించారు’’ అని పేర్కొంది.
(Release ID: 2141114)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam