ప్రధాన మంత్రి కార్యాలయం
చార్టర్డ్ అకౌంటెంట్ల దినోత్సవం సందర్భంగా సీఏలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు
Posted On:
01 JUL 2025 9:34AM by PIB Hyderabad
చార్టర్డ్ అకౌంటెంట్ల దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు చార్టర్డ్ అకౌంటెంట్లకు శుభాకాంక్షలు తెలిపారు. చార్టర్డ్ అకౌంటెంట్ల నైపుణ్యం, ఖచ్చితత్వం, ప్రతి సంస్థకూ ఎంతో అవసరమని శ్రీ మోదీ వాఖ్యానించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:
‘‘చార్టర్డ్ అకౌంటెంట్లందరికీ సీఏ డే శుభాకాంక్షలు. వారి ఖచ్చితత్వం, నైపుణ్యం ప్రతి ఒక్క సంస్థకూ అవసరం. చట్టపరిధిలో పనిచేయడం, పారదర్శకతలను ప్రస్తావిస్తూ, ఆరోగ్యకరమైన ఆర్థిక వ్యవస్థకు వారు దన్నుగా ఉంటున్నారు. విజయవంతమైన వ్యాపార సంస్థలను తీర్చిదిద్దడంలో వారి పాత్ర అపూర్వం’’ అని పేర్కొన్నారు.
***
(Release ID: 2141119)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam