ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పదేళ్ల డిజిటల్ ఇండియా ప్రస్థానానికి ప్రధాని ప్రశంసలు

Posted On: 01 JUL 2025 9:40AM by PIB Hyderabad

విజయవంతంగా పదేళ్లు పూర్తి చేసుకున్న డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారుదశాబ్దం తర్వాత ఎన్నో జీవితాల్లో మార్పులు తీసుకొచ్చిననవయుగ సాధికారతకు నాంది పలికిన ప్రయాణానికి మనం సాక్షులుగా నిలిచామని ప్రధాని పేర్కొన్నారు. ‘‘140 కోట్ల భారతీయుల సమష్టి సంకల్పంతో డిజిటల్ చెల్లింపుల్లో భారత్ గొప్ప పురోగతిని సాధించింది.’’

మైగవ్ఇండియా ఎక్స్‌లో చేసిన పోస్టును పంచుకుంటూ ప్రధాని ఇలా అన్నారు:
‘‘#10YearsOfDigitalIndia 
ను జరుపుకొంటున్న ఈ రోజు చరిత్రాత్మకం!

పదేళ్ల కిందటమన దేశాన్ని డిజిటల్ సాధికారత సాధించినసాంకేతికంగా అభివృద్ధి చెందిన సమాజంగా మార్చడానికి డిజిటల్ ఇండియా కార్యక్రమం ప్రారంభమైంది.

దశాబ్దం తర్వాతఎంతో మంది జీవితాల్లో మార్పు తీసుకొచ్చిననవయుగ సాధికారతకు నాంది పలికిన ప్రయాణానికి మనం సాక్షులుగా నిలిచాం. 140 కోట్ల భారతీయుల సమష్టి సంకల్పంతో డిజిటల్ చెల్లింపుల్లో భారత్ గొప్ప పురోగతిని సాధించిందిఆరోగ్యంవిద్య లాంటి రంగాలు ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి పొందాయి.

ఈ మార్పులనువాటి ప్రభావానికి సంబంధించిన వివరాలను ఈ పోస్టు మీకు అందిస్తుంది!’’

 

***


(Release ID: 2141121)