ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం
azadi ka amrit mahotsav

తమిళనాడులోని పరమకుడి - రామనాథపురం విభాగాన్ని (ఎన్‌హెచ్-87) రూ. 1853 కోట్ల వ్యయంతో 4 వరుసలుగా విస్తరించేందుకు క్యాబినెట్ ఆమోదం

Posted On: 01 JUL 2025 3:13PM by PIB Hyderabad

తమిళనాడులోని పరమకుడిరామనాథపురం మధ్య 46.7 కి.మీ మేర వరుసల రహదారిని నిర్మించేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిందిదీన్ని హైబ్రిడ్ యాన్యుటీ పద్ధతిలో (హెచ్ఏఎంరూ. 1,853 కోట్ల మూలధన వ్యయంతో చేపట్టనున్నారు

మధురైపరమకుడిరామనాథపురంమండపంరామేశ్వరంధనుష్కోటి మధ్య అనుసంధానం ప్రస్తుతం ఉన్న వరుసల జాతీయ రహదారిపైరాష్ట్ర రహదారులపై ఆధారపడి ఉందిఅధిక ట్రాఫిక్ వల్ల ఈ రహదారులన్నీ ఇరుకుగా మారిపోయాయిఈ ప్రాంతంలో ఉన్న కీలక పట్టణాలతో పాటు జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాలు ట్రాఫిక్ సమస్యను ఎదుర్కొంటున్నాయివీటిని పరిష్కరించేందుకు పరమకుడి నుంచి రామనాథపురం వరకు దాదాపు 46.7 కి.మీ మేర జాతీయ రహాదారి-87ను నాలుగు వరుసలకు విస్తరించనున్నారుఇది రద్దీని తగ్గించిభద్రతను మెరుగుపరటమే కాకుండా వేగంగా అభివృద్ధి చెందుతున్న పరమకుడిసత్తిరకుడిఅచుందన్వాయల్రామనాథపురం పట్టణాల రవాణా అవసరాలను తీరుస్తుంది

ఈ మార్గం ప్రధాన జాతీయ రహదారులైన ఎన్‌హెచ్-38, ఎన్‌హెచ్-85, ఎన్‌హెచ్-36, ఎన్‌హెచ్-536, ఎన్‌హెచ్-32లను.. 3 రాష్ట్ర రహదారులైన ఎస్‌హెచ్-47, ఎస్‌హెచ్-29, ఎస్‌హెచ్-34లను కూడా అనుసంధానిస్తుందిఇది దక్షిణ తమిళనాడు వ్యాప్తంగా కీలకమైన ఆర్థికసామాజికరవాణా కేంద్రాలకు ఆటంకం లేని అనుసంధానతను అందించనుందిఈ కారిడార్ ప్రధాన రైల్వే స్టేషన్లు (మధురైరామేశ్వరం), 1 విమానాశ్రయం (మదురై), 2 చిన్న ఓడరేవులను (పాంబన్రామేశ్వరంకూడా కలుపుతుందిఈ మార్గం బహుళ నమూనా అనుసంధానతను అందిస్తూ ఈ ప్రాంతంలో వస్తువులుప్రయాణికులు ఒక చోటు నుంచి మరో చోటుకు వెళ్లటాన్ని వేగవంతంసులభతరం చేయనుంది

నిర్మాణం పూర్తయిన అనంతరం పరమకుడి-రామనాథపురం ఈ ప్రాంత ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషించనుందిప్రధాన మతపరమైనఆర్థిక కేంద్రాల మధ్య అనుసంధానతను బలోపేతం చేయనుందిరామేశ్వరంధనుష్కోటి పర్యాటకాన్ని పెంచనుందివాణిజ్యంపారిశ్రామిక అభివృద్ధికి కొత్త ద్వారాలను తెరుస్తుందిఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా దాదాపు 8.4 లక్షల పనిదినాలుపరోక్షంగా 10.45 లక్షల పనిదినాల ఉపాధి లభించనుందిదీని నిర్మాణంతో చుట్టుపక్కల ప్రాంతాలలో వృద్ధిఅభివృద్ధిసంపద సృష్టిలో కొత్త అవకాశాలను తీసుకురానుంది

 

అంశం

వివరాలు

ప్రాజెక్టు పేరు

వరుసల పరమకుడి రామనాథపురం విభాగం

విభాగం

మధురై ధనుష్కోటి కారిడార్ (ఎన్‌హెచ్-87)

పొడవు (కి.మీ)

46.7

మొత్తం వ్యయం (రూకోట్లు)

997.63

భూ సేకరణ ఖర్చు (రూకోట్లు)

340.94

మొత్తం మూలధన వ్యయం (రూకోట్లు)

1,853.16

నిర్మాణ పద్ధతి

హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ (హెచ్‌ఏ‌ఎం)

అనుసంధానం కానున్న ప్రధాన రహదారులు

జాతీయ రహదారులుఎన్‌హెచ్-38, ఎన్‌హెచ్-85, ఎన్‌హెచ్-36, ఎన్‌హెచ్-536, ఎన్‌హెచ్-32

రాష్ట్ర రహదారులుఎస్‌హెచ్ -47, ఎస్‌హెచ్ -29, ఎస్‌హెచ్- 34

అనుసంధానం కానున్న ఆర్థికసామాజికరవాణా కేంద్రాలు

 

చిన్న తరహా ఓడరేవులుపంబన్రామేశ్వరం

అనుసంధానం కానున్న ప్రధాన నగరాలుపట్టణాలు

మధురైపరమకుడిరామనాథపురంరామేశ్వరం

ఉపాధి కల్పన సామర్థ్యం

ప్రత్యక్షంగా 8.4 లక్షల పనిదినాలుపరోక్షంగా 10.5 లక్షల పనిదినాలు

2024-25లో రోజువారీ వార్షిక సగటు ట్రాఫిక్ (ఏఏడీటీ)

అంచనా- 12,700 ప్రయాణ కార్ యూనిట్లు (పీసీయూ)

 

 

***
 

 

(Release ID: 2141212)