ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జీఎస్‌టీ ఒక కీలక సంస్కరణ... భారత ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చివేసింది: ప్రధానమంత్రి

Posted On: 01 JUL 2025 3:49PM by PIB Hyderabad

జీఎస్‌టీని పరిచయం చేసి ఎనిమిది సంవత్సరాలయిందిఅప్పటి నుంచి అది భారత ఆర్థిక స్వరూపాన్ని మార్చివేసిన ఒక ప్రధాన సంస్కరణగా నిలదొక్కుకున్నదని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభివర్ణించారు. ‘‘చట్ట పరిధిలో పనిచేయడంలోని భారాన్ని తగ్గించిఇది వ్యాపార నిర్వహణలో సౌలభ్యాన్ని.. మరీ ముఖ్యంగా చిన్నమధ్య తరహా పరిశ్రమలకు సౌలభ్యాన్ని.. చెప్పుకోదగ్గ స్థాయిలో మెరుగుపరచింది’’ అని శ్రీ మోదీ అన్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశంలో:

‘‘జీఎస్‌టీని ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటికి ఎనిమిది సంవత్సరాలయిందిఇది భారతదేశ ఆర్థిక స్వరూపాన్ని మార్చివేసిన ఒక ప్రధాన సంస్కరణగా నిలిచింది.

చట్ట పరిధిలో పనిచేయడంలోని భారాన్ని తగ్గించిఇది వ్యాపార నిర్వహణలో సౌలభ్యాన్ని.. మరీ ముఖ్యంగా చిన్నమధ్య తరహా పరిశ్రమలకు సౌలభ్యాన్ని.. చెప్పుకోదగ్గ స్థాయిలో మెరుగుపరచింది.

జీఎస్‌టీ ఆర్థిక వృద్ధిని వేగిరం చేసిందిఅదే కాలంలోఇండియా మొత్తాన్నీ ఒక మార్కెట్టుగా అనుసంధానించేందుకు సాగుతున్న ప్రయాణంలో రాష్ట్రాలను సమాన భాగస్వాములను చేస్తూ సిసలైన సహకార పూర్వక సమాఖ్య వాదాన్ని ప్రోత్సహించింది.’’ అని పేర్కొన్నారు. ‌

 

**‌*


(Release ID: 2141265)