కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కేంద్ర మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా న్యూఢిల్లీలో ఇండియా పోస్ట్ బిజినెస్ మీట్ 2025-26లో గ్రామీణ స్థాయి నుండి వృద్ధి కోసం విస్తృత ప్రణాళికను ఆవిష్కరించారు

Posted On: 15 JUL 2025 6:21PM by PIB Hyderabad

కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి; మరియు ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా నాయకత్వంలో పోస్టల్ శాఖ న్యూఢిల్లీలో తన వార్షిక వ్యాపార సమావేశం 2025-26ను నిర్వహించింది. ఈ వ్యూహాత్మక సమావేశం దేశవ్యాప్తంగా ఉన్న సర్కిల్ అధిపతులను (చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్స్ ను) ఒకచోట చేర్చింది, ఇండియా పోస్ట్ యొక్క వ్యాపార పరివర్తనకు మరియు ప్రీమియం లాజిస్టిక్స్, పౌర-కేంద్రీకృత సేవల ప్రదాతగా దాని అభివృద్ధి చెందుతున్న పాత్రకు రోడ్‌మ్యాప్‌పై చర్చించడానికి ఇది తోడ్పడింది.

కేంద్ర మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా వ్యాపార సమావేశం 2025-26ను ఉద్దేశించి ప్రసంగించారు.

పోస్టల్ కార్యదర్శి శ్రీమతి వందిత కౌల్ స్వాగతోపన్యాసంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు, గత సంవత్సరంలో డిపార్ట్‌మెంట్ సాధించిన కీలక విజయాలను ఆమె వివరించారు. భవిష్యత్తు కోసం ఆవిష్కరణ, సమ్మిళితత్వం మరియు ఇండియా పోస్ట్‌ను ఆధునిక, సేవా-ఆధారిత సంస్థగా నిరంతరం అభివృద్ధి చేయడం వంటి వ్యూహాత్మక ప్రాధాన్యతలను ఆమె నొక్కి చెప్పారు.

అంతర్గత కమ్యూనికేషన్ మరియు విజ్ఞాన భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి ఒక ముఖ్యమైన అడుగుగా, శ్రీ సింధియా కొత్త నెలవారీ ఇ-న్యూస్‌లెటర్ 'డాక్ సంవాద్' ను ప్రారంభించారు. ఈ ఇ-న్యూస్‌లెటర్ వేదిక ఆవిష్కరణలు, వ్యాపార అవగాహన మరియు క్షేత్రస్థాయి విజయ గాథలను వెలుగులోకి తీసుకువస్తుంది, ఇండియా పోస్ట్ ఉద్యోగుల దృఢత్వం మరియు వారు అందిస్తున్న సేవలు, పౌరుల అచంచలమైన నమ్మకం వంటి పరివర్తన కథనాలను తెలియజేస్తుంది. డాక్ సంవాద్ విశాలమైన ఇండియా పోస్ట్ నెట్‌వర్క్‌లోని వాటాదారులను ప్రేరేపించడం, విద్యావంతులను చేయడం మరియు కనెక్ట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది.

కేంద్ర మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా & పోస్టల్ కార్యదర్శి శ్రీమతి వందిత కౌల్ నెలవారీ ఇ-న్యూస్‌లెటర్‌ను ప్రారంభించారు.

ఈ సమావేశంలో, అన్ని సర్కిల్ అధిపతులు (చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్స్) తమ వ్యాపార పనితీరు, ప్రాంతీయ కార్యక్రమాలు, సవాళ్లు మరియు వృద్ధిని వేగవంతం చేయడానికి వ్యూహాలను సమర్పించారు. ఈ సమర్పణలు జాతీయ ప్రాధాన్యతలతో సమలేఖనం చేయడానికి మరియు లాజిస్టిక్స్, బ్యాంకింగ్, ఇ-కామర్స్ మరియు ప్రజా సేవల డెలివరీలో ఇండియా పోస్ట్ సామర్థ్యాలను పెంచడానికి జరుగుతున్న శక్తివంతమైన, గ్రామీణ స్థాయి ప్రయత్నాలను నొక్కి చెప్పాయి.

శ్రీ సింధియా ప్రతి ప్రాంతం యొక్క అభివృద్ధి, అడ్డంకులు మరియు ఆశయాలను శ్రద్ధగా వింటూ ప్రతినిధులతో లోతుగా సంభాషించారు. తన ప్రసంగంలో, గ్రామీణ-పట్టణ అంతరాన్ని తగ్గించడంలో మరియు బలమైన లాజిస్టిక్స్, ఆర్థిక సమ్మిళితత్వం మరియు డిజిటల్ కనెక్టివిటీ ద్వారా సమ్మిళిత వృద్ధిని బలోపేతం చేయడంలో ఇండియా పోస్ట్ కీలక పాత్రను ఆయన పునరుద్ఘాటించారు.

"ఇండియా పోస్ట్ కేవలం ఒక సేవ కాదు, మన దేశంలోని మారుమూల ప్రాంతాలను కలుపుతున్న ఒక జీవనరేఖ. దేశంలోని ప్రతి మూల నుండి శక్తి, నిబద్ధత మరియు ఆలోచనలను చూసి గర్విస్తున్నాను," అని శ్రీ సింధియా అన్నారు.

సంస్థ యొక్క పురోగతిని ప్రశంసిస్తూ, పనితీరు కొలమానాలు, ఆవిష్కరణలు మరియు జవాబుదారీతనాన్ని పెంపొందించే కార్పొరేట్-శైలి నిర్మాణాన్ని అవలంబించినందుకు ఇండియా పోస్ట్‌ను మంత్రి అభినందించారు. తన ప్రజా సేవా బాధ్యతను నిలబెట్టుకుంటూ లాజిస్టిక్స్ మరియు ఆర్థిక సేవల్లో ఇండియా పోస్ట్ తీవ్రంగా పోటీ పడేలా వృత్తిపరమైన, సేవా-ఆధారిత సంస్కృతిని పెంపొందించడం యొక్క ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు.

అంతేకాకుండా, గౌరవనీయులైన మంత్రవర్యులు వివిధ సర్కిల్‌లకు వారి నిర్దిష్ట విభాగాలలో సామర్థ్యానికి అనుగుణంగా 20% నుండి 30% వరకు ఆశాజనకమైన వృద్ధి లక్ష్యాన్ని FY 2025-26 సంవత్సరమునకు నిర్దేశించారు. ఈ లక్ష్యం, సామాజిక బాధ్యతకు ఎటువంటి రాజీ పడకుండా, భారత ప్రభుత్వానికి స్థిరమైన లాభ కేంద్రంగా ఇండియా పోస్ట్‌ను మార్చాలనే విస్తృత లక్ష్యంలో భాగమని వారు పేర్కొన్నారు.

ఈ సమావేశంలో, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రక్రియల సరళీకరణ, సామర్థ్య పెంపుదల మరియు డిజిటల్ సాధికారతపై కూడా దృష్టి సారించాలి అని చర్చించారు, ఇవన్నీ ఇండియా పోస్ట్‌ను భవిష్యత్ కు సిద్ధంగా, చివరి (last) మైలు లాజిస్టిక్స్ మరియు సేవా కేంద్రంగా నిలపడానికి అవసరమైన అంశాలు.

వార్షిక వ్యాపార సమావేశం, సంస్థ అంతటా వ్యాపార వృద్ధిని వేగవంతం చేయడానికి, సాంకేతికతను సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి మరియు సేవ, ఆవిష్కరణ మరియు శ్రేష్ఠత సంస్కృతిని పెంపొందించడానికి బలమైన సామూహిక సంకల్పంతో ముగిసింది.

2025-26 వ్యాపార సమావేశం  

 

 

*****


(Release ID: 2145315) Visitor Counter : 3