ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) పై ఉచిత 5-రోజుల ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌ను నిర్వహించనున్న సి-డాక్, హైదరాబాద్

Posted On: 17 JUL 2025 4:14PM by PIB Hyderabad

భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) మద్దతుతో హైదరాబాద్‌లోని సి-డాక్‌ సంస్థ ఆగస్టు 4 నుండి 8, 2025 వరకు “ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఐడియా టు ప్రోటోటైప్ టు ప్రొడక్ట్ (I-P-P)” పై 5 రోజుల ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (FDP) ను నిర్వహిస్తోంది.

ఈ కార్యక్రమం ITI, పాలిటెక్నిక్‌ కాలేజీల అధ్యాపకులు మరియు STEM సబ్జెక్టులను బోధించే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ల(PGT) కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ లో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) ఆర్కిటెక్చర్, IoT కేస్ స్టడీస్, IoT ఎకోసిస్టమ్, LPWAN ప్రొటొకాల్స్ (LoRa, NB-IoT మొదలైనవి), IoT కమ్యూనికేషన్ టెక్నాలజీలు, IoT నెట్‌వర్కింగ్, అప్లికేషన్ లేయర్ ప్రోటోకాల్‌లు, క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్‌ఫారమ్‌లు, ఐడియా నుండి ప్రోటోటైప్ నుండి ప్రోడక్ట్ వరకు (I-P-P మోడల్), మరియు IoT సెక్యూరిటీ మొదలైన కీలక సాంకేతిక అంశాలపై 40 గంటల నిపుణుల సెషన్‌లు ఉంటాయి.

పరిమిత సీట్లు అందుబాటులో ఉన్నందున, మొదట వచ్చిన వారికి ప్రాధాన్యత ఆధారంగా సీట్లు కేటాయించబడతాయి. శిక్షణ పూర్తి చేసి ముగింపు పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు ప్రదానం చేయబడతాయి. అర్హత గల అధ్యాపకులు జూలై 31, 2025 లోపు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. మరిన్ని వివరాల కొరకు, నోడల్ కోఆర్డినేటర్‌ను eict-cdachyd@cdac.in ఇమెయిల్ ద్వారా సంప్రదించండి లేదా +91-7207265580 కు కాల్ చేయండి.

 

***


(Release ID: 2145498)
Read this release in: English