రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

స్వచ్ఛ్ సర్వేక్షణ్ పురస్కారాలను ప్రదానం చేసిన రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము సంప్రదాయ జీవన విధానాలను నుంచి నేర్చుకున్న అంశాలతో ఆధునిక పునర్వినియోగ వ్యవస్థలు సుసంపన్నం: రాష్ట్రపతి

Posted On: 17 JUL 2025 1:58PM by PIB Hyderabad

గృహ నిర్మాణంపట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఈరోజు (2025, జులై 17) న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము స్వచ్ఛ్ సర్వేక్షణ్ పురస్కారాలను ప్రదానం చేశారు.

పరిశుభ్రత నెలకొల్పేందుకు  నగరాలు చేస్తున్న కృషిని అంచనా వేసేందుకుప్రయత్నాలని ప్రోత్సహించేందుకు స్వచ్ఛ్ సర్వేక్షణ్ చక్కని అభ్యాసంగా నిలిచిందని రాష్ట్రపతి అన్నారుసుమారు 14 కోట్ల మంది పౌరులురాష్ట్ర ప్రభుత్వాలునగర పాలక సంస్థలు సహా వివిధ భాగస్వాములు పాల్గొన్న 2024 పరిశుభ్రత సర్వేను గృహ నిర్మాణంపట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ చేపట్టడం తనకు సంతోషాన్ని కలిగించిందనీఈ సర్వే ప్రపంచంలోనే అతి పెద్దదిగా నిలిచిందని రాష్ట్రపతి చెప్పారు.

పురాతన కాలం నుంచి మన సాంస్కృతికఆధ్యాత్మిక వారసత్వం పరిశుభ్రతకు ఎంతో విలువనిచ్చిందని రాష్ట్రపతి పేర్కొన్నారుఇళ్ళుప్రార్థనా స్థలాలుపరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం భారతీయుల జీవన శైలిలో భాగమని అన్నారుజాతిపిత మహాత్మా గాంధీ పరిశుభ్రతను ఈశ్వరుని రూపంగా భావించేవారని గుర్తు చేశారుతంఆధ్యాత్మికతసామాజిక జీవనానికి పరిశుభ్రత పునాది వంటిదని బాపూజీ భావించేవారన్నారుపరిశుభ్రతకు సంబంధించిన పనితోనే తాను ప్రజాజీవితాన్ని  ప్రారంభించినట్లు శ్రీమతి ముర్ము చెప్పారునోటిఫైడ్ ఏరియా కౌన్సిల్ ఉపాధ్యక్షురాలి హోదాలో తాను ప్రతిరోజూ వార్డులను సందర్శించిపరిశుభ్రత కార్యకలాపాలని స్వయంగా పర్యవేక్షించడాన్ని గుర్తు చేసుకున్నారు.  

వనరులను పరిమితంగా వాడటం.. అదే పనికి కానీవేరే పనికి కానీ అదే వనరుని తిరిగి ఉపయోగించడంతద్వారా వ్యర్థాలను నివారించడం మన జీవన విధానంలో భాగమని శ్రీమతి ముర్ము అన్నారునేటి ఆధునిక పునరుపయోగ వ్యవస్థ సిద్ధాంతాలురెడ్యూస్రీయూజ్రీసైకిల్ నినాదాలు ఒకనాటి జీవన విధానాన్ని ప్రతిబింబించేవేనని రాష్ట్రపతి అభిప్రాయపడ్డారుఉదాహరణగా గిరిజన సమూహాల జీవన విధానాన్ని గురించి చెబుతూవారు సాదాజీవితాన్ని గడుపుతారనివనరులని మితంగా వినియోగించుకుంటూ ఇతర సమూహాల భాగస్వామ్యంతో వాతావరణంపర్యావరణాలకు అనుకూలంగా జీవిస్తారని అన్నారుప్రకృతి ప్రసాదించిన సహజ వనరుల విలువ గుర్తెరిగివాటిని వ్యర్థం చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటారనివారి ప్రవర్తనపద్ధతుల నుంచి ఆధునిక సమాజం పాఠాలు నేర్చుకుని పునరుపయోగ వ్యవస్థలను సుసంపన్నం చేసుకోవచ్చునని సూచించారు.  

వ్యర్థాల నిర్వహణ వ్యవస్థలో అన్నిటికన్నా కీలకమైన మొదటి అడుగు సోర్స్ సెగ్రిగేషన్ – లేదా వ్యర్థాలను తడి,పొడి వంటి విభాగాల కింద విభజించడమని చెప్పారుఈ రంగంతో సంబంధమున్న వారందరూప్రతి కుటుంబం దీనికి అత్యంత ప్రాముఖ్యతనివ్వాలని రాష్ట్రపతి ఉద్బోధించారుజీరో-వేస్ట్ కాలనీలు ఇందుకు చక్కని ఉదాహరణలుగా నిలుస్తున్నాయన్నారు.  

విద్యార్థులు పరిశుభ్రతను జీవిత విలువగా స్వీకరించాలనే లక్ష్యంతో ప్రారంభించిన పాఠశాల స్థాయి మూల్యాంకన కార్యక్రమాన్ని రాష్ట్రపతి ప్రశంసించారుచక్కని ఫలితాలను చూపే ఈ కార్యక్రమం దీర్ఘకాలిక ప్రయోజనాలను కలిగి ఉంటుందని శ్రీమతి ముర్ము అభిప్రాయపడ్డారు.

ప్లాస్టిక్ఎలక్ట్రానిక్ వ్యర్థాల నిర్వహణవాటి ద్వారా పర్యావరణకు కలిగే హానిని నియంత్రించడం పెద్ద సవాలుగా నిలుస్తోందని రాష్ట్రపతి అన్నారుఅయితేసరైన దిశలో చేసే ప్రయత్నాల వల్ల ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించగలమన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 2022లో ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులు కొన్నింటి వాడకాన్ని కేంద్ర ప్రభుత్వం నిషేధించిందని గుర్తు చేశారుఅదే సంవత్సరంలో ప్లాస్టిక్ ప్యాకేజీకి సంబంధించి తయారీదారులకు ‘ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ’ పేరిట కొన్ని మార్గదర్శకాలను జారీ చేసిందని చెప్పారుఆయా మార్గదర్శకాలను సంపూర్ణంగా పాటించే బాధ్యత తయారీదారులుబ్రాండ్ల సొంతదారులుదిగుమతిదారులు సహా భాగస్వాములందరికీ ఉంటుందని చెప్పారు.  

పరిశుభ్రతకు సంబంధించి చేపట్టే కృషిలో ఆర్థికసాంస్కృతికభౌగోళిక పార్శ్వాలు ఉంటాయని రాష్ట్రపతి అన్నారుప్రజలందరూ అంకితభావంతో స్వచ్ఛ్ భారత్ మిషన్ లో పాల్గొంటారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 2047 నాటికి పరిపూర్ణంగా అభివృద్ధి చెందిన భారతదేశంచక్కని వ్యూహాలుబలమైన సంకల్పాల సాయంతో ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన దేశాలలో ఒకటిగా నిలువగలదని రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము అన్నారు.

 

***


(Release ID: 2145513)