రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

ఎవరెస్టు, కిలిమంజారో పర్వతారోహణ బృందాలకు లాంఛనంగా స్వాగతం పలికిన రక్షణ శాఖ కార్యదర్శి

प्रविष्टि तिथि: 17 JUL 2025 1:21PM by PIB Hyderabad

ఎవరెస్టుకిలిమంజారో పర్వతారోహణను విజయవంతంగా ముగించిన సాహస యాత్రికులకు జూలై 17న న్యూఢిల్లీలోని సౌత్ బ్లాక్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో రక్షణ కార్యదర్శి శ్రీ రాజేశ్ కుమార్ సింగ్ లాంఛనంగా స్వాగతం పలికారుఉత్తరాఖండ్ ఉత్తర కాశీలోని నెహ్రూ పర్వతారోహణ సంస్థ (ఎన్ఐఎం)ను స్థాపించి 60 ఏళ్లయిన సందర్భంగా ఎవరెస్టు శిఖరారోహణ చేపట్టారుపశ్చిమ బెంగాల్ డార్జిలింగ్‌లోని హిమాలయన్ పర్వతారోహణ సంస్థ (హెచ్ఎంఐ), జమ్మూ కాశ్మీర్ పహల్గాంలోని జవహర్ పర్వతారోహణశీతాకాల క్రీడల సంస్థ (జేఐఎండబ్ల్యూఎస్సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారుఆఫ్రికాలో ఎత్తయిన శిఖరం కిలిమంజారో ఆరోహణ యాత్రను హెచ్ఎంఐ నిర్వహించగా.. దివ్యాంగుడైన శ్రీ ఉదయ్ కుమార్‌ కూడిన బృందం ఈ యాత్రను చేపట్టిందిమోకాలికి పైభాగం వరకు 91 శాతానికి పైగా వైకల్యం ఉన్న ఆయన ఈ ఘనతను సాధించడం విశేషం.

ఇరుబృందాల అచంచల స్ఫూర్తిదృఢ సంకల్పంధైర్యసాహసాలను రక్షణ కార్యదర్శి కొనియాడారుఇవి కేవలం పర్వతారోహణలు మాత్రమే కావన్న ఆయన.. సాహస క్రీడా కార్యకలాపాల్లో భారత పర్వతారోహణ నైపుణ్యాన్ని చాటుతూ దేశాన్ని ముందంజలో నిలుపుతున్నాయని అన్నారుఎవరెస్ట్ శిఖరాన్నికిలిమంజారో పర్వతాన్ని విజయవంతంగా అధిరోహించిన రెండు బృందాలు.. సరికొత్త ప్రమాణాలను నిర్దేశిస్తూ దేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువ పర్వతారోహకులకు స్ఫూర్తిగా నిలిచాయని వ్యాఖ్యానించారు.

యువత సాధికారతస్వావలంబనసాహసం... వీటివల్లే పటిష్టమైనదృఢతరమైనవెనుకడుగు వేయని భారత్‌ సాకారమవుతుందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ బలంగా విశ్వసిస్తారని శ్రీ రాజేశ్ కుమార్ సింగ్ పేర్కొన్నారురక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన నాలుగు పర్వతారోహణ సంస్థలు హెచ్ఎంఐఎన్ఐఎంజేఐఎండబ్ల్యూఎస్జాతీయ పర్వతారోహణసాహస క్రీడల సంస్థ (ఎన్ఐఎంఏఎస్ఈ లక్ష్యానికి అద్భుతమైన ఉదాహరణలుగా అభివర్ణించారు.

ఎవరెస్టు శిఖరాధిరోహణ

ఈ యాత్రకు ఎన్ఐఎం ప్రిన్సిపాల్ కల్నల్ అన్షుమన్ భదౌరియా నేతృత్వం వహించారుకల్నల్ హేమచంద్ర సింగ్ (డిప్యూటీ లీడర్), మూడు సంస్థలకు చెందిన అధ్యాపకులుశ్రీ రాకేశ్ సింగ్ రాణాసుబేదార్ బహదూర్ పహాన్హవల్దార్ రాజేంద్ర ముఖియానాయక్ తుస్తాన్ సెవాంగ్శ్రీ పసాంగ్ టెన్సింగ్ షెర్పా ఈ బృందంలో సభ్యులుగా ఉన్నారు.

image.jpeg

ఖుంబు లోయ గుండా ప్రపంచంలో అత్యంత ఎత్తయిన శిఖరం ఎవరెస్ట్ శిఖరాన్ని మే 23న ఈ బృందం అధిరోహించిందిశిక్షకులకు ప్రత్యక్షానుభవాన్నివ్వడంతోపాటు భావి పర్వతారోహకుల్లో స్ఫూర్తిని నింపి సుశిక్షితులుగా తీర్చిదిద్దడం ఈ యాత్ర లక్ష్యం.

కిలిమంజారో పర్వతారోహణ

ఈ యాత్రకు డార్జిలింగ్ గ్రూప్ హెచ్ఎంఐ ప్రిన్సిపాల్ కెప్టెన్ జై కిషన్ నేతృత్వం వహించారుకెప్టెన్ శ్రుతిసుబేదార్ మహేంద్ర కుమార్ యాదవ్శ్రీ పావెల్ శర్మశ్రీమతి సులక్షణా తమాంగ్ ఈ బృందంలో సభ్యులు.

image.jpeg

2024 ఆగస్టు 8న కిలిమంజారో పర్వతంపై అతిపెద్ద జాతీయ పతాకాన్ని ప్రదర్శించడం ద్వారా ఈ బృందం ప్రపంచ రికార్డును నెలకొల్పిందిఅనంతరం టాంజానియాలోని దార్ ఎస్ సలాం వద్ద హిందూ మహాసముద్రంలో 35 అడుగుల లోతులో నీటి అడుగున జాతీయ పతాకాన్ని ప్రదర్శించారుతర్వాత ఆఫ్రికా ఖండంలో తొలిసారిగా దివ్యాంగుల బృందం సమష్టిగా స్కైడైవ్ నిర్వహించిందిచేరుకోలేని ప్రాంతమంటూ ఏదీ లేదన్నట్లుగా... భూమిపైనానీటిలోగాల్లో అన్నింటా సరికొత్త విజయాలను ఈ సాహసయాత్ర సాధించింది.  

 

***


(रिलीज़ आईडी: 2145531)
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Hindi , Bengali , Tamil