ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానితో కొరియా ప్రత్యేక రాయబారుల ప్రతినిధి బృందం భేటీ
Posted On:
17 JUL 2025 6:40PM by PIB Hyderabad
కిమ్ బూ క్యుమ్ నేతృత్వంలోని కొరియా ప్రత్యేక రాయబారుల ప్రతినిధి బృందం ఈరోజు న్యూఢిల్లీలో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో భేటీ అయ్యింది.
కొరియా అధ్యక్షుడు శ్రీ జేమ్యుంగ్ లీతో ఇటీవల తన సమావేశం అత్యంత సానుకూలంగా జరిగిందని గుర్తుచేసుకున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.. పదేళ్లు పూర్తి చేసుకుంటున్న భారత్ - కొరియా ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి భారత్ కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. ఆవిష్కరణలు, రక్షణ, నౌకానిర్మాణం, నైపుణ్య వినిమయం సహా కీలక రంగాల్లో ఈ భాగస్వామ్యం నిరంతరం పురోగమిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఆయన ఇలా పేర్కొన్నారు:
“కిమ్ బూ క్యుమ్ నేతృత్వంలోని కొరియా ప్రత్యేక రాయబారుల ప్రతినిధి బృందానికి స్వాగతం పలకడం సంతోషాన్నిస్తోంది. గత నెలలో అధ్యక్షుడు @Jaemyung_Leeతో అత్యంత ఆశాజనకంగా జరిగిన సమావేశం నాకు గుర్తొస్తోంది. భారత్ – కొరియా ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యానికి పదేళ్లు పూర్తవుతున్నాయి. ఆవిష్కరణలు, రక్షణ నుంచి నౌకానిర్మాణం, నైపుణ్య వినిమయం వరకు ఇది నిరంతరం పురోగమిస్తోంది. రెండు ప్రజాస్వామిక దేశాల మధ్య సన్నిహిత సహకారం ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, సంక్షేమానికి దోహదం చేస్తుంది.’’
***
(Release ID: 2145661)
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam