ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

నువాఖాయి పండుగ సందర్భంగా ప్రధానమంత్రి శుభాకాంక్షలు

నాడు పోస్టు చేయడమైనది: 28 AUG 2025 1:16PM by PIB Hyderabad

నువాఖాయి పర్వదిన సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దేశ ఆహార భద్రతకు, అభివృద్ధికి వెన్నుముకగా నిలిచిన రైతుల కృషిని ఈ పండుగ గుర్తుచేస్తుందన్నారు. మనందరినీ ఏకతాటిపై తీసుకువచ్చే రైతులపై కృతజ్ఞత భావనను, ఐక్యతా స్పూర్తిని ప్రతిబింబిస్తుందని ఆయన పేర్కొన్నారు.

ఈ మేరకు ఎక్స్‌లో ప్రధాని ఇలా రాశారు.

‘ప్రతి ఒక్కరికీ నువాఖాయి పండుగ శుభాకాంక్షలు. ఈ ప్రసిద్ధమైన పండుగ రైతుల కష్టాన్ని, వారిపై మనకున్న కృతజ్ఞతను గుర్తుచేస్తుంది. ప్రతి ఇంట్లో ఆరోగ్యం, సంపద, ఆనందం నిండాలని కోరుకుంటున్నాను.

నువాఖాయి జుహార్!’


(రిలీజ్ ఐడి: 2161479) సందర్శకుల సూచీ సంఖ్య : : 67