ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అఫ్గనిస్థాన్ భూకంపం మృతులకు ప్రధానమంత్రి సంతాపం

प्रविष्टि तिथि: 01 SEP 2025 2:16PM by PIB Hyderabad

ఆఫ్ఘ‌నిస్థాన్‌ లో భూకంపం కారణంగా జరిగిన ప్రాణ నష్టంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు సంతాపం తెలిపారు.

'ఎక్స్'  వేదికగా చేసిన పోస్ట్ లో ప్రధానమంత్రి మోదీ ఇలా పేర్కొన్నారు:

"ఆఫ్ఘ‌నిస్థాన్‌  లో సంభవించిన భూకంపం కారణంగా జరిగిన ప్రాణ నష్టంపై తీవ్ర దిగ్భ్రాంతి చెందాను. ఈ క్లిష్ట సమయంలో మరణించిన వారి కుటుంబాలకు సంతాపం తెలుపుతున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. భూకంపం ధాటికి ప్రభావితులైన వారికి భారత్ అన్ని విధాలుగా మానవతా సాయంసహాయక చర్యలను అందించేందుకు సిద్ధంగా ఉంది."


(रिलीज़ आईडी: 2162828) आगंतुक पटल : 13
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , Urdu , Marathi , हिन्दी , Bengali-TR , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada