ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మహారాష్ట్రలోని యావత్మల్‌లో పలు ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం

Posted On: 28 FEB 2024 8:37PM by PIB Hyderabad

జై భవానీజై భవానీజై సేవాలాల్జై బిర్సా!

అందరికీ శుభాకాంక్షలు!

మహారాష్ట్ర గవర్నర్ శ్రీ రమేష్ బైస్ గారుముఖ్యమంత్రి శ్రీ ఏక్‌నాథ్ షిండే గారుఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్ గారుఅజిత్ పవార్ గారుఈ రోజున ఈ కార్యక్రమానికి హాజరైన ఇతర ప్రముఖులందరికీ స్వాగతంఈ రోజు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో మన రైతు సోదరీ సోదరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారునేను వారిని కూడా స్వాగతిస్తున్నాను.

సోదరీ సోదరులారా,

ఛత్రపతి శివాజీ మహారాజ్ జన్మించిన ఈ పవిత్ర భూమికి నేను గౌరవపూర్వకంగా నమస్కరిస్తున్నానుమహారాష్ట్ర పుత్రుడుదేశానికే గర్వకారణం అయిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికీ నేను నివాళులర్పిస్తున్నానుయావత్మల్-వాషిమ్ ప్రాంతంలోని ధైర్యవంతులైన బంజారా సోదరీ సోదరులకు రామ్ రామ్.

మిత్రులారా,

10 సంవత్సరాల కిందట "చాయ్ పర్ చర్చాకార్యక్రమం కోసం నేను యావత్మల్ వచ్చినప్పుడు మీరు నన్ను సమృద్ధిగా ఆశీర్వదించారుదేశ ప్రజలు ఎన్‌డీఏకు 300కి పైగా సీట్లు ఇచ్చారుతరువాత నేను 2019 ఫిబ్రవరి నెలలో మళ్ళీ యావత్మల్‌ను సందర్శించానుమరోసారి మీరు మాపై ప్రేమను కురిపించారు.. ఎన్‌డీఏకు 350కి పైగా సీట్లు లభించాయిఇప్పుడు 2024 ఎన్నికలకు ముందూ నేను అభివృద్ధి వేడుకలో పాలుపంచుకుంటున్నప్పుడు దేశమంతటా ఒకే నినాదం ప్రతిధ్వనిస్తోందిఈసారి... 400 (సీట్లు)కు మించిఈసారి, 400 (సీట్లు)కు మించి... ఈసారి... 400 (సీట్లు)కు మించినన్ను ఆశీర్వదించడానికి ఇంత పెద్ద సంఖ్యలో వచ్చిన తల్లులుఆడపడుచులను నా ముందు చూస్తున్నానుజీవితంలో ఇంతకంటే గొప్ప అదృష్టం ఇంకేముంటుందిఈ గ్రామాల తల్లులుఆడపడుచులకు నేను ప్రత్యేకంగా నా గౌరవపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నానుయావత్మల్వాషిమ్చంద్రాపూర్విదర్భ ప్రాంతాల నుంచి వచ్చిన అపారమైన ఆశీర్వాదాలు మా విజయాన్ని ముందే నిర్ణయించాయి... ఎన్‌డీఏ ప్రభుత్వం... 400 (సీట్లు)కు మించిఎన్‌డీఏ ప్రభుత్వం... 400 (సీట్లు)కు మించి!

మిత్రులారా,

ఛత్రపతి శివాజీ మహారాజ్‌ మాకు ఆదర్శంఆయన పాలన 350 సంవత్సరాలు పూర్తి చేసుకుందిఆయన పట్టాభిషేకం చేసిన సమయంలో ఆయనకు అన్నీ అందుబాటులో ఉండేవిఆయన ఆ అధికారాన్ని హాయిగా అనుభవించగలిగేవారుఅయినా ఆయన ఎప్పుడూ అధికారంలో మునిగిపోలేదుఆయన దేశ చైతన్యాన్నిశక్తిని అత్యున్నతంగా భావించారుఆయన జీవించినంత కాలం ఈ లక్ష్యం కోసమే పనిచేశారుఆయనలాగే మేం కూడా దేశాన్ని నిర్మించడంపౌరుల జీవితాలను మార్చే లక్ష్యంతో బయలుదేరాంగత 10 సంవత్సరాల్లో మేం చేసింది రాబోయే 25 సంవత్సరాలకు పునాదిదేశంలోని ప్రతి మూలనూ అభివృద్ధి చేయాలని నేను నిశ్చయించుకున్నానుఈ నిబద్ధతలో విజయం కోసం నా శరీరంలోని ప్రతి కణం.. నా జీవితంలోని ప్రతి క్షణం.. మీ అందరి సేవకు అంకితం చేశాంభారత్‌ను అభివృద్ధి చేయడానికి పేదలురైతులుయువతమహిళా సాధికారత నాలుగు ప్రధాన ప్రాధాన్యాలుఈ నలుగురికి అధికారం లభిస్తే దేశంలోని ప్రతి సమాజంప్రతి తరగతిప్రతి కుటుంబం సాధికారత పొందుతాయి.

మిత్రులారా,

ఈ రోజు యావత్మల్‌లో పేదలురైతులుయువతమహిళలను శక్తిమంతం చేయడానికి గణనీయమైన కృషి జరిగిందిమహారాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టుల ప్రారంభోత్సవంతో పాటు వాటిని జాతికి అంకితం చేశాంఈ రోజు రైతులు నీటిపారుదల సౌకర్యాలను పొందుతున్నారు.. పేదలకు పక్కా ఇళ్ళు లభిస్తున్నాయి.. గ్రామాల్లోని నా ఆడపడుచులకు ఆర్థిక సహాయం అందుతోంది.. యువత భవిష్యత్తును రూపొందించే మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నాంవిదర్భ-మరాఠ్వాడ రైలు కనెక్టివిటీని మెరుగుపరచడంకొత్త రైళ్లను ప్రారంభించడం లక్ష్యంగా పలు ప్రాజెక్టులు ఈ రోజు ప్రారంభమయ్యాయిఈ విజయాలన్నింటి కోసం మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.

మిత్రులారా,

కేంద్రంలో ఇండీ కూటమి అధికారంలో ఉన్నప్పటి పరిస్థితిని గుర్తు చేసుకోండిఆ సమయంలో వ్యవసాయ మంత్రి మహారాష్ట్రకు చెందినవారేఅప్పట్లో ఢిల్లీ నుంచి విదర్భ రైతులకు ప్యాకేజీలు ప్రకటించారు.. అయితే మధ్యలోనే ఆ నిధులు దుర్వినియోగం అయ్యాయిగ్రామాలుపేదలురైతులుగిరిజన వర్గాలకు ఏమీ అందలేదునేటి దృశ్యాన్ని చూడండి.. నేను ఒక బటన్ నొక్కిన కొద్దిసేపటిలోనే పీఎమ్ కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 21,000 కోట్ల రూపాయలు దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతుల ఖాతాలకు చేరాయి. 21,000 కోట్ల రూపాయలు చిన్న సంఖ్య కాదుఇది మోదీ హామీకాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఢిల్లీ నుంచి మంజూరైన ప్రతి రూపాయిలో 15 పైసలు మాత్రమే లబ్ధిదారులకు చేరాయినేడు కాంగ్రెస్ అధికారంలో ఉంటే మీరు అందుకున్న 21,000 కోట్లలో 18,000 కోట్లు మధ్యలోనే దుర్వినియోగం అయ్యేవిభాజపా ప్రభుత్వంలో పేదల ప్రతి పైసా వారికే చేరుతుందిఇది మోదీ హామీప్రతి లబ్ధిదారునికి వారి పూర్తి హక్కు లభిస్తుంది.. ప్రతి పైసా వారి బ్యాంకు ఖాతాలోకే వెళుతుంది.

మిత్రులారా,

మహారాష్ట్ర రైతులకు డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో డబుల్ గ్యారెంటీ ఉందిఇటీవల మహారాష్ట్ర రైతులకు అదనంగా 3800 కోట్ల రూపాయలు బదిలీ అయ్యాయిఅంటే మహారాష్ట్ర రైతులు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ఏటా 12,000 రూపాయలు అందుకుంటున్నారు.

మిత్రులారా,

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా దేశవ్యాప్తంగా 11 కోట్ల మంది రైతుల ఖాతాల్లో ఇప్పటివరకు లక్షల కోట్లకు పైగా జమ అయ్యాయిదీని ఫలితంగా మహారాష్ట్ర రైతులకు 30,000 కోట్లుయావత్మల్ రైతులకు 900 కోట్లు వచ్చాయిఈ డబ్బు చిన్న రైతులకు ఎంత ప్రయోజనం చేకూరుస్తుందో ఊహించుకోండికొన్ని రోజుల కిందటే మా ప్రభుత్వం చెరకు గిట్టుబాటు ధరను రికార్డు స్థాయిలో పెంచిందిఇప్పుడు చెరకు గిట్టుబాటు ధర క్వింటాలుకు 340 రూపాయలుఇది మహారాష్ట్రలోని లక్షలాది మంది చెరకు రైతులకుక్షేత్రస్థాయి కార్మికులకు ప్రయోజనం చేకూరుస్తుందికొద్ది రోజుల కిందట మన గ్రామాల్లో ధాన్యం నిల్వ గిడ్డంగులను నిర్మించడానికి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రణాళికను ప్రారంభించాంఈ గిడ్డంగులను మన రైతు సహకార సంఘాలే నిర్వహిస్తాయిఇది ముఖ్యంగా చిన్న రైతులకు ప్రయోజనం చేకూరుస్తుందివారు తమ ఉత్పత్తులను తక్కువ ధరకు అమ్మాల్సిన అవసరం ఇకమీదట ఉండదు.

స్నేహితులారా,

వికసిత్ భారత్’ సాధించడానికి బలమైన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కీలకంఅందుకే గ్రామాల్లో నివసించే ప్రతి కుటుంబం ఎదుర్కొంటున్న సమస్యలను తొలగించడానికివారికి ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించేందుకు గత పదేళ్లుగా మేం నిరంతరం కృషి చేస్తున్నాంనీటి ప్రాధాన్యం గురించి విదర్భ కంటే ఎక్కువగా ఇంకెవరికి తెలుసుఅది తాగునీరైనాసాగునీరైనా.. 2014కు ముందు దేశంలోని గ్రామాల్లో సంక్షోభం ఉండేదిఅయితే అప్పటి ఇండీ కూటమి ప్రభుత్వానికి దీని గురించి పట్టించుకొనేందుకు సమయం దొరకలేదుఒక్కసారి ఆలోచించండిస్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి 2014 వరకు 100 కుటుంబాల్లో 15 కుటుంబాలకు మాత్రమే నీటి కుళాయి వసతి ఉండేదిఫలితంగా, పేదలుదళితులువెనబడిన వర్గాలుగిరిజన కుటుంబాల్లో ఎక్కువ భాగం ప్రయోజనాలకు దూరంగా ఉండేవిఇది మన తల్లులుఆడపడుచులకు పెద్ద కష్టంగా మారిందిఈ సమస్యను పరిష్కరించడానికిదీని నుంచి వారికి ఉపశమనం కల్పించడానికే ఎర్ర కోట నుంచి ‘హర్ ఘర్ జల్’ (ఇంటింటికీ నీరుహామీని మోదీ ఇచ్చారుఅప్పటి నుంచి నాలుగైదేళ్ల వ్యవధిలోనే ప్రతి 100లో 75 గ్రామీణ కుటుంబాలకు కుళాయి నీటి సదుపాయం కల్పించాంమహారాష్ట్రలో కూడా 50 లక్షల కంటే తక్కువ కుటుంబాలకే పైపుల ద్వారా నీరు అందేదిఇప్పుడు సుమారుగా 1.25 కోట్ల కుటుంబాలకు కుళాయి నీరు అందుతోందిఅందుకే మోదీ గ్యారంటీ అంటే కచ్చితంగా అమలవుతుందని దేశం చెబుతోంది.

స్నేహితులారా,

ఈ దేశ రైతులకు మోదీ మరో హామీ ఇచ్చారు. 100కు పైగా ప్రధాన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వాలు అలాగే వదిలేశాయిఇప్పుడు వాటిలో 60 పూర్తవగా మిగిలిన వాటి పనులు కొనసాగుతున్నాయినిలిచిపోయిన ప్రాజెక్టుల్లో మహారాష్ట్రలో అత్యధికంగా 26 ఉన్నాయిఎవరు చేసిన పాపాల ఫలితాన్ని తరాల తరబడి భరించాల్సి వచ్చిందో మహారాష్ట్రలో ముఖ్యంగా విదర్భలో ఉన్న ప్రతి వ్యవసాయ కుటుంబానికి తెలుసుకొనే హక్కు ఉందినిలిచిపోయిన ఈ 26 ప్రాజెక్టుల్లో 12 పూర్తవగా.. మిగిలిన వాటి పనులు వేగంగా జరుగుతున్నాయి. 50 ఏళ్ల తర్వాత నీల్వాండే డ్యామ్ ప్రాజెక్టును పూర్తి చేసింది బీజేపీ ప్రభుత్వమేకృష్ణ కొయినా ఎత్తిపోతల పథకంటెంభు ఎత్తిపోతల పథకం కూడా దశాబ్దాల అనంతరం పూర్తయ్యాయిగోసిఖుర్డ్ ప్రాజెక్టులో ఎక్కువ భాగం పని మా ప్రభుత్వ హయాంలోనే పూర్తయిందిమరాఠ్వాడావిదర్భ ప్రాంతాల్లో పీఎం కృషి సించాయిబలిరాజా జల సంజీవని పథకాల పరిధిలో 51 ప్రాజెక్టులను ఈ రోజు ప్రారంభించుకున్నాంఇవి 80,000 హెక్టార్లకు పైగా భూమిని ఈ ప్రాజెక్టులు సస్యశ్యామలం చేస్తాయి.

స్నేహితులారా,

గ్రామాల్లోని మహిళలను ‘లఖ్‌పతీ దీదీ’లుగా మారుస్తామని మోదీ హామీ ఇచ్చారుఇప్పటి వరకు దేశంలో కోటి మంది ఆడపడుచులు ‘లఖ్‌పతీ దీదీ’లుగా ఎదిగారుఈ ఏడాది బడ్జెట్లో మూడు కోట్ల మంది అక్కాచెల్లెళ్లను ‘లక్షాధికారి సోదరి’గా మార్చాలనే లక్ష్యాన్ని ప్రకటించాందీనిని సాధించేందుకు కట్టుబడి ఉన్నానుఇప్పుడు స్వయం సహాయక సంఘాల్లో మహిళల సంఖ్య 10 కోట్లు దాటిందివీరికి బ్యాంకుల నుంచి రూ.8 లక్షల కోట్లు అందాయిదీంతో పాటు రూ.40,000 కోట్ల ప్రత్యేక నిధులను కేంద్రం కేటాయించిందిమహారాష్ట్రలో పొదుపు సంఘాల సభ్యులకు కూడా గణనీయమైన ప్రయోజనం చేకూరిందిఈ సంఘాలకు నేడు రూ.800 కోట్లకు పైగా సాయం అందుతోందియవత్మల్ జిల్లాలోని మహిళలకు ఈ-రిక్షాలు అందించాంఈ కార్యక్రమం చేపట్టిన షిండే జీదేవేంద్ర జీఅజిత్ దాదామొత్తం మహారాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను.

స్నేహితులారా,

మన ఆడపడుచులు ఇప్పుడు ఈ-రిక్షాలు నడుపుతున్నారు.. త్వరలో వారు డ్రోన్లను ఎగరవేస్తారునమో దీదీ డ్రోన్ పథకం పరిధిలో డ్రోన్ పైలట్లుగా మహిళా బృందాలకు శిక్షణ ఇస్తున్నాంఅనంతరం వారికి ప్రభుత్వం డ్రోన్లను అందిస్తుందివీటిని వ్యవసాయంలో ఉపయోగిస్తారు.

స్నేహితులారా,

ఈ రోజు పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాంఅంత్యోదయ (అణగారిన వర్గాల అభ్యున్నతి)కు స్ఫూర్తినిచ్చిన వ్యక్తి పండిట్‌జీనేపేదల సంక్షేమానికే తన జీవితాన్ని పూర్తిగా అంకితం చేశారుపండిట్ జీ ఆలోచనల నుంచి మనం స్ఫూర్తి పొందాలిగడచిన పదేళ్లుగా మేం పేదల సంక్షేమానికే కట్టుబడి ఉన్నాంమొదటిసారిగాఉచిత రేషన్ అందించే హామీ ఇచ్చాంమొదటిసారి ఉచిత వైద్య సౌకర్యం అందుబాటులోకి వచ్చిందిమహారాష్ట్రలో ఒక కోటి కుటుంబాలకు ఆయుష్మాన్ కార్డులను అందించే కార్యక్రమం ఈ రోజు ప్రారంభమైందిమొదటిసారిగామిలియన్ల మంది పేదలకు పక్కా ఇళ్లు నిర్మించాంఈ రోజుఓబీసీ కుటుంబాలకు ఇళ్లు నిర్మించే ప్రత్యేక పథకం కూడా ప్రారంభమైందిఈ పథకం కింద ఓబీసీ కుటుంబాలకు 10 లక్షల పక్కా ఇళ్లు నిర్మిస్తాం.

స్నేహితులారా,

గతంలో ఎవరూ పట్టించుకోనివారి పట్ల మోదీ శ్రద్ధ వహిస్తున్నారువిశ్వకర్మబలుతేదార్‌ల కోసం ఏనాడు ఏ పథకం రూపొందించలేదుమొదటి సారిగా పీఎం విశ్వకర్మ యోజన పథకాన్ని రూ.13,000 కోట్ల బడ్జెట్‌తో మోదీ ప్రారంభించారుకాంగ్రెస్ హయాంలో గిరిజనులకు ఎప్పుడూ ప్రాధాన్యమివ్వలేదు.. వారికి ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదుగిరిజనుల్లోనే అత్యంత అణగారిన వర్గాలకు చెందిన వారి పట్ల మోదీ దృష్టి సారించారువారి అభివృద్ధి కోసం తొలిసారిగా రూ.23,000 కోట్ల వ్యయంతో పీఎం జన్మన్ యోజన ప్రారంభించాంఈ పథకం మహారాష్ట్రలోని కట్కారికోలంమడియా లాంటి గిరిజన తెగలకు మెరుగైన జీవితాన్ని అందిస్తుందిపేదలురైతులుయువతమహిళలకు ఈ కార్యక్రమం సాధికారత కల్పిస్తుందిరానున్న అయిదేళ్లలో మరింత వేగవంతమైన అభివృద్ధిని మనం చూస్తాంవిదర్భలో ప్రతి కుటుంబం వచ్చే అయిదేళ్లలో అభివృద్ధి చెందుతుందిమరోసారిరైతు కుటుంబాలతో పాటు అందరికీ శుభాకాంక్షలునాతో కలసి చెప్పండి:

భారత్ మాతా కీ జై!

భారత్ మాతా కీ జై!

భారత్ మాతా కీ జై!

ధన్యవాదాలు.

సూచనఇది ప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి తెలుగు అనువాదం

 

***


(Release ID: 2173389) Visitor Counter : 11