ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రిని కలిసిన ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోడై
Posted On:
11 OCT 2025 10:17PM by PIB Hyderabad
న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆంత్రోపిక్ సంస్థ సీఈఓ శ్రీ డారియో అమోడై సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత్ లో ఆంత్రోపిక్ విస్తరణ, క్లాడ్ కోడ్ వంటి ఏఐ సాధనాల వినియోగంపై చర్చించారు. దేశంలో జూన్ నుంచి క్లాడ్ కోడ్ వినియోగం అయిదు రెట్లు పెరిగినట్లు చర్చలో ప్రస్తావించారు.
మెరుగైన సాంకేతిక వ్యవస్థ, మానవ కేంద్రీకృతమైన, బాధ్యతాయుతమైన ఏఐ ఆవిష్కరణలను ముందుకు తీసుకెళ్లటంలో ప్రతిభావంతులైన యువతతో కూడిన దేశ సామర్థ్యాన్ని శ్రీ నరేంద్ర మోదీ తెలియజేశారు. ఆంత్రోపిక్ విస్తరణను స్వాగతిస్తూ.. ఈ భాగస్వామ్యం ద్వారా విద్య, ఆరోగ్యం, వ్యవసాయం వంటి కీలక రంగాల్లో భారత ఏఐ సామర్థ్యం బలపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఏఐ విధానం పట్ల భారత్ వైఖరిని, సమ్మిళిత వృద్ధికి సాంకేతికతను వినియోగించుకోవటాన్ని శ్రీ అమోడీ అభినందించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ లో ప్రధానమంత్రి ఇలా పోస్ట్ చేశారు:
“మిమ్మల్ని కలవటం సంతోషంగా ఉంది. మెరుగైన సాంకేతిక వ్యవస్థ, నైపుణ్యం గల యువతతో మానవ-కేంద్రీకృతమైన, బాధ్యతాయుతమైన ఏఐ ఆవిష్కరణలకు భారత్ సిద్ధంగా ఉంది. ఆంత్రోపిక్ సంస్థ విస్తరణను మేం స్వాగతిస్తున్నాం. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం వంటి కీలక రంగాల్లో అభివృద్ధికి ఏఐని వినియోగించుకునేందుకు మీతో కలిసి పనిచేయటానికి మేం ఎదురుచూస్తున్నాం”.
***
(Release ID: 2178060)
Visitor Counter : 9
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam