కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) 2025లో ‘రోబోటిక్స్ ఫర్ గుడ్ యూత్ ఛాలెంజ్ ఇండియా 2025’ ను నిర్వహించిన టెలి కమ్యూనికేషన్స్ విభాగం (డీఓటీ), అంతర్జాతీయ టెలి కమ్యూనికేషన్ యూనియన్ (ఐటీయూ)


ఐటీయూ రోబోటిక్స్ ఫర్ గుడ్ యూత్ ఛాలెంజ్ ఇండియా 2025ని ప్రారంభించిన డీసీసీ, మెంబర్ (సర్వీసెస్) శ్రీ దేవ్ కుమార్ చక్రవర్తి, టీఎస్ బీ చీఫ్, డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ బిలాల్ జామౌస్సీ

ఏఐ, రోబోటిక్స్ ఆవిష్కరణల్లో అగ్రగామిగా భారత్...

నైపుణ్యాలను పెంపొందించటం, ఆవిష్కరణలను ప్రోత్సహించటం ద్వారా

నూతన పోకడల్లో వైరుధ్యానికి పరిష్కారం….ఆవిష్కరణలే ఊపిరిగా నేటి యువత

ప్రపంచం నుంచి ఆకలిని తరిమికొట్టేందుకే….ఆహర, వ్యవసాయ సంస్థ, ఐటీయూ

రోబోటిక్స్ ఫర్ గుడ్ యూత్ ఛాలెంజ్ నిర్వహణ: శ్రీ చక్రవర్తి

విజేత (మొదటి స్థానం): జూనియర్ కేటగిరీ ఛాంపియన్ గా హేయాంశ్ బృందం.. జూలై 2026న స్విట్జర్లాండ్ లోని జెనీవాలో జరిగే గ్లోబల్ గ్రాండ్ ఫినాలేలో భారత్ తరపున ప్రాతినిధ్యం

సీనియర్ విభాగంలో విజేతగా నిలిచి... 2026లో జెనీవాలో జరిగే పోటీల్లో మరోసారి పాల్గొననున్న

ది ఆంబిషియస్ అవెంజర్స్ బృందం


యూఎన్ ఆధ్వర్యంలో జరిగే విద్యాపరమైన రోబోటిక్స్ పోటీ ‘రోబోటిక్స్ ఫర్ గుడ్ యూత్ ఛాలెంజ్ ’ ద్వారా ప్రపంచవ్యాప్తంగా యువతను ఐఏంసీ 2025లో భాగం చేసి, వాస్తవ ప్రపంచ సవాళ్లను పరిష్కరించేందుకు ఆచరణాత్మక రోబోటిక్ పరిష్కారాల ప్రదర్శనకు ప్రోత్సాహం

రోబోటిక్స్ ఫర్ గుడ్ యూత్ ఛాలెంజ్ ఇండియా 2025 విజేతలకు

బహుమతి ప్రదానంతో ముగిసిన కార్యక్రమం

Posted On: 12 OCT 2025 1:38PM by PIB Hyderabad

 నిన్న సాయంత్రం న్యూఢిల్లీలోని యశోభూమి, ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో రోబోటిక్స్ ఫర్ గుడ్ యూత్ ఛాలెంజ్ ఇండియా 2025 ముగింపు కార్యక్రమం జరిగిందిఆవిష్కరణసృజనాత్మకతయువ నాయకత్వ సాంకేతిక పురోగతి వేడుక స్ఫూర్తిదాయకంగా ముగిసింది.

ఇంటర్నేషనల్ టెలి కమ్యూనికేషన్ యూనియన్ (ఐటీయూప్రారంభించిన ‘ఏఐ ఫర్ గుడ్ ఇంపాక్ట్ ఇనిషియేటివ్’ కింద ఢిల్లీ ఐఐటీకి చెందిన ఐ-హబ్ ఫౌండేషన్ ఫర్ కోబోటిక్స్ (ఐహెచ్ఎఫ్ సీసహకారంతో కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖలోని టెలి కమ్యూనికేషన్స్ విభాగం (డీఓటీమద్దతుతో ఈ జాతీయ సదస్సు నిర్వహించారుసుస్థిరాభివృద్ధిఆహార భద్రత వంటి అంశాల పరిష్కారానికి రోబోటిక్స్ ద్వారా పరిష్కారాలను అభివృద్ధి చేస్తున్న యువ ఆవిష్కర్తల ప్రతిభకు పోటీ వేదికగా మారింది.

విజేతల ప్రకటన

పోటీలో పాల్గొన్న జూనియర్, సీనియర్ విభాగాల్లో మొదటిరెండోమూడో స్థానాలకు బహుమతులు ప్రకటించటంతో పాటు ప్రతి విభాగంలో అత్యంత వినూత్నమైన రోబోకు ప్రత్యేక గుర్తింపుని ఇచ్చారు.

జూనియర్ విభాగం

మొదటి విజేతబెంగళూరుకు చెందిన ప్లేటో ల్యాబ్స్ తరపున పాల్గొన్న హేయాంశ్ బృందం జూనియర్ విభాగంలో ఛాంపియన్ గా నిలిచిందిజూలై 2026న స్విట్జర్లాండ్ లోని జెనీవాలో జరిగే గ్లోబల్ గ్రాండ్ ఫినాలేలో భారత్ తరపున ప్రాతినిధ్యం వహించేందుకు ఈ బృందాన్ని ఎంపిక చేశారు.

రెండో విజేతరోబో నైట్స్ జూనియర్ బృందండీపీఎస్ ఆర్ కె పురంన్యూఢిల్లీ.

మూడో విజేతనైతిక్ బృందంప్లేటో ల్యాబ్స్బెంగళూరు.

అత్యంత వినూత్నమైన, ప్రత్యేకమైన రోబో: హేయాంశ్ బృందంప్లేటో ల్యాబ్స్బెంగళూరు.

సీనియర్ విభాగం

మొదటి విజేతకోయిరాజ్ పూర్వారణాసికి చెందిన సంతోష్ అతులానంద్ కాన్వెంట్ స్కూల్ నుంచి వచ్చిన ది ఆంబిషియస్ అవెంజర్స్ బృందం వరుసగా రెండో ఏడాది విజేతగా నిలిచిందిఈ బృందం జూలై 2026న జెనీవాలో జరగబోయే గ్లోబల్ గ్రాండ్ ఫినాలేలో భారత్ తరపున మరోసారి ప్రాతినిధ్యం వహిస్తుంది.

రెండో విజేత: ఆరవ్ బృందంప్లేటో ల్యాబ్స్బెంగళూరు.

మూడో విజేత: కోడ్ బృందంలోటస్ వ్యాలీ ఇంటర్నేషనల్ స్కూల్నోయిడా ఎక్స్ ప్రెస్ వేసెక్టార్ 126, నోయిడా.

అత్యంత వినూత్నమైన, ప్రత్యేకమైన రోబో: ఆరవ్ బృందంప్లేటో ల్యాబ్స్బెంగళూరు.

ప్రతిభ, టీమ్ వర్క్ఆవిష్కరణ స్ఫూర్తిని గుర్తించివిజేతలను న్యాయనిర్ణేతలు సన్మానించే సమయంలో చప్పట్లతో హాలు మార్మోగింది.

హాజరైన విశిష్ట అతిథులు

డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్, టెలి కమ్యూనికేషన్ విభాగం మెంబర్ (సర్వీసెస్శ్రీ దేవ్ కుమార్ చక్రవర్తిటెలి కమ్యూనికేషన్స్ విభాగండిప్యూటీ డైరెక్టర్ జనరల్ (టెలికాం టెక్నాలజీ డెవలప్ మెంట్ ఫండ్డాక్టర్ పరాగ్ అగర్వాల్ఢిల్లీ ఐఐటీలోని ఐ-హబ్ ఫౌండేషన్ ఫర్ కోబోటిక్స్ (ఐహెచ్ఎఫ్ సీముఖ్య కార్యనిర్వహణాధికారి డాక్టర్ అశుతోష్ శర్మఢిల్లీ ఐఐటీలోని మెకానికాల్ ఇంజినీరింగ్ విభాగం ఫ్రొఫెసర్ సునీల్ ఝాఇంటర్నేషనల్ టెలి కమ్యూనికేషన్స్ యూనియన్ (ఐటీయూలోని ఏఐ అండ్ రోబోటిక్స్ ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్రీ గిల్లెం మార్టినెజ్ రౌరాతో పాటు టెలి కమ్యూనికేషన్స్ విభాగంఐటీయూఐహెచ్ఎఫ్ సీ-ఐఐటీ ఢిల్లీ నుంచి ఇతర సీనియర్ అధికారులు.. అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.

అతిథులంతా విజేతలకు అభినందనలు తెలిపి.. ఆవిష్కరణల దిశగానేర్చుకునేందుకు నిరంతర కృషిని కొనసాగించాలంటూఅన్ని జట్లకు శుభాకాంక్షలు చెప్పారు.

డిజిటల్ భద్రతపై అవగాహనా కార్యక్రమం

యువతకు డిజిటల్ భద్రత అనే అంశంపై డీఓటీ, ఏడీఈటీ (ఏఐ అండ్ డీఐయూశ్రీమతి దీక్షా ధీమాన్ ప్రత్యేక ప్రదర్శన ఇచ్చారుఆన్ లైన్ భద్రతా ప్రాముఖ్యతబాధ్యతాయుతమైన డిజిటల్ భాగస్వామ్యంసాంకేతికతను నైతికంగా వినియోగించటంపై పాఠశాల విద్యార్థుల్లో అవగాహన కల్పించటమే ఈ ప్రదర్శన లక్ష్యంఎనిమిది వేర్వేరు రాష్ట్రాల పోటీదారులు పాల్గొన్న ఈ సెషన్.. ఆవిష్కర్తలతో పాటు బాధ్యతాయుతమైన డిజిటల్ పౌరులను తయారు చేయటంపై ప్రభుత్వ ప్రాధాన్యతను స్పష్టం చేసింది.

యువ ప్రతిభ, ప్రపంచ లక్ష్యాల వేడుక

దేశం నలుమూలల నుంచి 55 జట్ల ద్వారా 271 మంది పోటీదారులు రోబోటిక్స్ ఫర్ గుడ్ యూత్ ఛాలెంజ్ ఇండియా 2025 కార్యక్రమంలో సృజనాత్మకతటీమ్ వర్క్సాంకేతిక నైపుణ్యాన్ని ప్రదర్శించారుతమ అద్భుతమైన ప్రదర్శనతో జూనియర్ విభాగంలో హేయాంశ్ బృందంసీనియర్ విభాగంలో ఆంబిషియస్ అవెంజర్స్ బృందం.. ఏఐ ఫర్ గుడ్ ఇంపాక్ట్ ఇనిషియేటివ్ కింద స్విట్జర్లాండ్ లోని జెనీవాలో జరిగే గ్లోబల్ గ్రాండ్ ఫినాలే (జూలై నుంచి 10, 2026)లో భారత్ కు ప్రాతినిధ్యం వహించనున్నాయి.

కార్యక్రమం చివర్లో ఐటీయూడీఓటీఐహెచ్ఎఫ్ సీఐఐటీ ఢిల్లీ మధ్య సహకార స్ఫూర్తిని అతిథులు ప్రశంసించారుసామాజిక ప్రయోజనాలనుడిజిటల్ ఆవిష్కరణలను ఈ సహకారం ముందుకు తీసుకెళ్తుందన్నారునైతిక బాధ్యతతో సాంకేతిక ఆవిష్కరణలు చేయాలని పోటీదారులను ప్రోత్సహిస్తూమానవాళికి సేవ చేసే సాంకేతికత అభివృద్ధికి భారత్ ఇస్తున్న ప్రాధాన్యతను స్పష్టం చేశారు.

న్యూఢిల్లీలో ఇవాళ జరిగిన ఐఎంసీ 2025, 9వ ఎడిషన్ లో యూఎన్ ఆధ్వర్యంలో జరిగే ప్రపంచ రోబోటిక్స్ పోటీ అయిన ‘రోబోటిక్స్ ఫర్ గుడ్ యూత్ ఛాలెంజ్ ఇండియా 2025’నిటెలి కమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ పాలసీ విభాగండిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ బిలాల్ జామౌస్సీశ్రీ చక్రవర్తి ప్రారంభించారు.

భారత కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖటెలి కమ్యూనికేషన్ల విభాగం (డీఓటీ), అంతర్జాతీయ టెలి కమ్యూనికేషన్ యూనియన్ (ఐటీయూ), ఐహెచ్ఎఫ్ సీఐఐటీ ఢిల్లీలోని టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ భాగస్వామ్యంతో సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయిరోబోటిక్స్ఏఐఐఓటీ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాల్లో సాంకేతికతఆవిష్కరణప్రపంచ సహకారంతో యువతకు సాధికారత కల్పించాలనే భారత ప్రభుత్వ దార్శనికతను ఈ కార్యక్రమం స్పష్టం చేస్తుంది.

10 నుంచి 18 ఏళ్ల వయసున్న విద్యార్థులను ఈ పోటీకి ఆహ్వానించగా.. వ్యవసాయంఆహార భద్రత వంటి కీలక రంగాల్లోని ప్రపంచ సవాళ్ల పరిష్కారానికి ఏఐరోబోటిక్స్ ద్వారా పరిష్కారాలను అభివృద్ధి చేయాల్సి ఉందివ్యక్తిగతంగాజట్టుగా పాల్గొనే అవకాశం ఉండగా.. పోటీ గేమ్ బోర్డులో ఇచ్చిన ఆహార భద్రతా సవాళ్లను పరిష్కరించటానికి ఒక రోబో ను డిజైన్ చేసిఅభివృద్ధి చేయటంప్రోగ్రామింగ్ ఇవ్వటం ఇందులో భాగంవ్యవసాయంఆహార భద్రతపై దృష్టి సారించి.. జట్లు తమ నైపుణ్యాలతో అపారమైన ప్రతిభనుసృజనాత్మకతను ప్రదర్శించాయి. 2026లో జెనీవాలో జరిగే ‘ఏఐ ఫర్ గుడ్ గ్లోబల్ సమ్మిట్’ సందర్భంగా నిర్వహించే గ్రాండ్ ఫినాలేకు క్వాలిఫైయింగ్ టోర్నమెంట్ గా ఈ జాతీయ స్థాయి కార్యక్రమాన్ని నిర్వహించారు.

రోబోటిక్స్ ఫర్ గుడ్ యూత్ ఛాలెంజ్ ఇండియా 2025

ఐటీయూఏఐ ఫర్ గుడ్ కార్యక్రమంలో రోబోటిక్స్ ఫర్ గుడ్ యూత్ ఛాలెంజ్ ముఖ్యమైన ప్రాజెక్టుఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు రోబోటిక్స్ఏఐని ఉపయోగించే భవిష్యత్ తరం ఆవిష్కర్తలను ప్రోత్సహించటం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యంరోబోటిక్స్ అంశంలో ప్రపంచానికి మెరుగైనసమ్మిళితసుస్థిరమైన పరిష్కారాలను కనుగొనటంలోని సవాలు.. విద్యార్థులుఅధ్యాపకులుసాంకేతిక నిపుణుల మధ్య ప్రపంచ సహకారాన్ని పెంపొందిస్తుంది.

రోబోటిక్స్ ఫర్ గుడ్ యూత్ ఛాలెంజ్ ఇండియా కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు పాల్గొని.. సమానసుస్థిరమైన వృద్ధిని సాధించటంలో ఏఐ పాత్రపై చర్చించారు. ‘రోబోటిక్స్ అండ్ ఏఐ ఫర్ యూత్ సొసైటీ’, ‘డిజిటల్ సేఫ్టీ ఫర్ యూత్’, ‘ఏఐ ఫర్ గుడ్ప్రపంచస్థాయి సవాళ్ల పరిష్కారం దిశగా ఏఐరోబోటిక్స్’, ‘రోబోటిక్స్ అండ్ ఏఐ ఫర్ యూత్-లెడ్ సొసైటీ’ వంటి విభిన్నకీలక అంశాలపై చర్చలు జరిగాయి.

ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) 2025 గురించి

ఆసియాలోనే అతిపెద్ద సాంకేతిక వేదికైన ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ)ని టెలి కమ్యూనికేషన్స్ విభాగంసెల్యూలార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఓఏఐసంయుక్తంగా నిర్వహించాయిప్రపంచ ఐసీటీడిజిటల్ వ్యవస్థకు సంబంధించిన నాయకులు ఈ కార్యక్రమానికి హాజరై.. అనుసంధానతడిజిటల్ పరివర్తనమారుతున్న ఏఐ సాంకేతికతకు సంబంధించి భవిష్యత్ ఆవిష్కరణలపై చర్చించారు.

మరిన్ని వివరాలకు డీఓటీ హ్యాండిల్స్ ను అనుసరించండి:

X - https://x.com/DoT_India

Insta-  https://www.instagram.com/department_of_telecom?igsh=MXUxbHFjd3llZTU0YQ==

Fb - https://www.facebook.com/DoTIndia

Youtube: https://youtube.com/@departmentoftelecom?si=DALnhYkt89U5jAaa 

 

***


(Release ID: 2178509) Visitor Counter : 5