Ministry of Personnel, Public Grievances & Pensions
azadi ka amrit mahotsav

డీఎల్సీ ప్రచార ఏర్పాట్లను సమీక్షించడానికి ఆంధ్రప్రదేశ్‌ను సందర్శించనున్న కేంద్ర ప్రభుత్వ పెన్షన్ & పెన్షనర్ల సంక్షేమ మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ శ్రీ ప్రవేశ్ కుమార్

Posted On: 03 NOV 2025 4:18PM by PIB Hyderabad

భారత ప్రభుత్వ సిబ్బంది, ప్రజా అభ్యర్థనలు & పింఛన్లు మంత్రిత్వశాఖకు చెందిన పింఛన్ & పింఛనుదారుల సంక్షేమ విభాగం అండర్ సెక్రటరీ, శ్రీ ప్రవేశ్ కుమార్, నవంబర్ 04, 2025న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా, గుడివాడ పట్టణంలో పర్యటించనున్నారు. ఇక్కడ “దేశవ్యాప్త డిజిటల్ జీవిత ధృవపత్రం (డీఎల్‌సీ) ప్రచారం 4.0 (2025)”లో భాగంగా జరుగుతున్న డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ శిబిరం ఏర్పాట్లను సమీక్షించనున్నారు. 

ఈ సందర్శనలో భాగంగా ప్రవేశ్ కుమార్, అండర్ సెక్రటరీ, ఫేస్ ఆథెంటికేషన్, డోర్‌స్టెప్ డీఎల్‌సీ సేవలను పొందుతున్న పింఛనుదారులతో మాట్లాడతారు. అలాగే బ్యాంకులు, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్  (ఐపీపీబి),  యుఐడిఏఐ, ఎన్ఐసీ మరియు స్థానిక పింఛనుదారుల సంక్షేమ సంఘాల మధ్య సమన్వయ పరిస్థితిని సమీక్షించి, అవసరమైన మార్గదర్శకాలను అందజేయనున్నారు. 

దేశవ్యాప్తంగా డిజిటల్ జీవిత ధృవపత్రం కార్యక్రమం-2025, నవంబర్ 1 నుంచి 30 వరకు పింఛన్ & పింఛనుదారుల సంక్షేమ విభాగం (DoPPW) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ ప్రచారం ప్రధాన లక్ష్యం పింఛనుదారులకు డిజిటల్ సాధికారతను అందించడం, వారి జీవనాన్ని సులభతరం చేయడం.

ఈ కార్యక్రమం ద్వారా ఆధార్ ఆధారిత ఫేస్ ఆథెంటికేషన్ పద్ధతిను ప్రోత్సహిస్తున్నారు, దాంతో పింఛనుదారులు బయోమెట్రిక్ పరికరాలు అవసరం లేకుండానే తమ లైఫ్ సర్టిఫికేట్‌ను డిజిటల్‌గా సమర్పించవచ్చు.

ఈ కార్యక్రమాల ద్వారా వయోవృద్ధులైన పింఛనుదారులు, విభిన్న సామర్థ్యాలు కలిగిన పింఛనుదారులపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ఇందుకోసం ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబి) ద్వారా డోర్‌స్టెప్ డీఎల్‌సీ సేవలు అందిస్తున్నాయి.

ఈ కార్యక్రమం బ్యాంకులు, యుఐడిఏఐ, మైటీ (MeitY), ఎన్ఐసీ, సీజీడీఏ, రైల్వేలు, పింఛనుదారుల సంఘాలు వంటి కీలక భాగస్వాములను ఒక వేదికపైకి తీసుకువస్తూ, ఎన్ఐసీ డీఎల్‌సీ పోర్టల్ ద్వారా రియల్ టైమ్ మానిటరింగ్ సదుపాయాన్ని కల్పిస్తోంది.

గత సంవత్సరం నవంబర్ 2024లో జరిగిన ‘మన్ కి బాత్’ మరియు ‘సంవిధాన దినోత్సవం’ ప్రసంగాలలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఈ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ (డీఎల్‌సీ) కార్యక్రమాన్ని అభినందిస్తూ, ఇది పింఛన్ ప్రక్రియను సులభతరం చేసి దేశవ్యాప్తంగా ఉన్న సీనియర్ సిటిజన్ల జీవన ప్రమాణాలను మెరుగుపరిచిందని పేర్కొన్నారు.

*****


(Release ID: 2185873) Visitor Counter : 6
Read this release in: English