హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మహిళల కబడ్డి ప్రపంచ కప్- 2025ను గెలుచుకున్న భారత మహిళా కబడ్డి జట్టుకు హృదయపూర్వక అభినందనలు: కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా


మన మహిళా కబడ్డి జట్టు చరిత్రను సృష్టించింది..
ఇది ఎంతో గర్వకారణం

ప్రతిభావంతులైన భారత క్రీడాకారులు ఎవ్వరికీ తీసిపోరని
మీ అద్భుత విజయం పునరుద్ఘాటిస్తోంది..
రాబోయే కాలంలోనూ మీరు రాణించాలని ఆకాంక్షిస్తున్నాను

నాడు పోస్టు చేయడమైనది: 24 NOV 2025 9:41PM by PIB Hyderabad

మహిళల కబడ్డి ప్రపంచ కప్- 2025ను భారత మహిళా కబడ్డి జట్టు గెలుచుకున్నందుకు కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ అమిత్ షా ఒక సందేశాన్ని పొందుపరుస్తూ ఇలా పేర్కొన్నారు:
‘‘మన మహిళా కబడ్డి జట్టు చరిత్ర సృష్టించడం మనమంతా ఎంతో గర్వించదగిన సందర్భం. మహిళల కబడ్డి ప్రపంచ కప్- 2025ను గెలుచుకున్నందుకు పూర్తి జట్టుకు అభినందనలు. మీరు సాధించిన అద్భుత విజయం, ప్రతిభావంతులైన భారత క్రీడాకారులు ఎందుకు ఎవ్వరికీ తీసిపోరో పునరుద్ఘాటిస్తున్నది. రాబోయే కాలంలో కూడా మీరు రాణించాలి.. మీకు ఇవే శుభాకాంక్షలు.’’

 

***


(రిలీజ్ ఐడి: 2194040) సందర్శకుల సూచీ సంఖ్య : : 30
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , हिन्दी , Marathi , Assamese , Punjabi , Kannada , Malayalam