కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో Gen-Z థీమ్ పోస్టాఫీస్ ప్రారంభం

प्रविष्टि तिथि: 10 DEC 2025 1:01PM by PIB Hyderabad

విశాఖపట్నం, 09 డిసెంబర్ 2025 – విద్యార్థులు, పరిశోధకులు మరియు క్యాంపస్ సమాజానికి ఆధునిక తపాలా సేవలను మరింత చేరువ చేయడానికి ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిసరాల్లో అత్యాధునిక Gen-Z థీమ్ పోస్టాఫీస్‌ను ఈ రోజు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇదే మొదటి Gen-Z థీమ్ పోస్టాఫీస్.

ఈ కార్యక్రమానికి ఆంధ్ర విశ్వవిద్యాలయ ఆచార్యులు, గౌరవనీయులైన వైస్ ఛాన్సలర్ ప్రొ. జీ. పీ. రాజశేఖర్ గారు ప్రధాన అతిథిగా హాజరయ్యారు. విశిష్ట అతిథిగా విశాఖపట్నం ప్రాంతపు గౌరవనీయ తపాలా పోస్ట్‌మాస్టర్ జనరల్ శ్రీ వి. ఎస్. జయశంకర్ గారు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమం ఉదయం 11:00 గంటలకు ప్రారంభమైంది. యువత అవసరాలకు అనుగుణంగా రూపొందించిన ఈ సదుపాయాన్ని గౌరవనీయ వైస్ చాన్స్‌లర్ ఆవిష్కరించారు. Gen-Z పోస్టాఫీస్‌లో ఆధునిక సాంకేతికతను సాంప్రదాయ తపాలా సేవలతో సమన్వయం చేస్తూ, డిజిటల్‌-ఫ్రెండ్లీ కౌంటర్లు, వేగవంతమైన పార్సిల్ సేవలు, విద్యార్థి కేంద్రిత పరిష్కారాలు మరియు మెరుగైన కస్టమర్ అనుభవాన్ని అందిస్తున్నారు.

ఈ సందర్భంలో మాట్లాడిన వైస్ ఛాన్సలర్ గారు, ఆంధ్రప్రదేశ్‌లో తొలి Gen-Z పోస్టాఫీస్ ఆంధ్ర విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో ఉండటం పట్ల గర్వంగా, ఆనందంగా ఉందని పేర్కొన్నారు. థీసిస్, ప్రాజెక్టులు సిద్ధం చేసే విద్యార్థులకు మరియు కెరీర్ అభివృద్ధి కోసం ఆలోచనలను పంచుకునే వారికి ఇది ఎంతో మేలు చేస్తుందని అన్నారు. శ్రీ వి. ఎస్. జయశంకర్ గారు, తపాలా పోస్ట్‌మాస్టర్ జనరల్, భారత తపాలా వ్యవస్థ ఆవిష్కరణ మరియు అందుబాటును పెంపొందించేందుకు కట్టుబడి ఉందని, విద్యార్థులందరూ ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరారు.

కొత్తగా ప్రారంభించిన ఈ కేంద్రం వేలాది విద్యార్థులు మరియు సిబ్బందికి సేవలు అందిస్తూ, క్యాంపస్‌లో కమ్యూనికేషన్ మరియు లాజిస్టిక్స్‌కు ఒక సజీవ కేంద్రంగా మారనుంది.

***


(रिलीज़ आईडी: 2201342) आगंतुक पटल : 47
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English