ప్రధాన మంత్రి కార్యాలయం
దేవ్‌నీమొరీ పవిత్ర అవశేషాల ప్రదర్శనను ప్రారంభించినందుకు శ్రీలంక అధ్యక్షునికి కృతజ్ఞతలు తెలిపిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
05 FEB 2026 10:45AM by PIB Hyderabad
కొలంబోలోని పావన గంగారామయా ఆలయంలో దేవ్‌నీమొరీ పవిత్ర అవశేషాల ప్రదర్శనను ప్రారంభించినందుకు శ్రీలంక అధ్యక్షుడు శ్రీ అనూర కుమార దిసానాయకేకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు.
శ్రీలంకలో 2025వ సంవత్సరం ఏప్రిల్లో తాను పర్యటించిన సందర్భంగా ఈ పవిత్ర అవశేషాలను శ్రీలంకకు
తీసుకురావాలని, అక్కడి ప్రజలకు శ్రద్ధాంజలి ఘటించే అవకాశమివ్వాలని తాను తీసుకున్న నిర్ణయాన్ని ప్రధానమంత్రి గుర్తుకు తెచ్చుకొన్నారు.
భారత్, శ్రీలంక శతాబ్దాలుగా కొనసాగుతూన్న ఉమ్మడి వారసత్వం, సాంస్కృతిక బదిలీలతోనూ, పటిష్ఠమవుతున్న ప్రగాఢ నాగరికతాపరమైన, ఆధ్యాత్మికపరమైన సంబంధాలతోనూ ముడిపడి ఉన్నాయని శ్రీ మోదీ ఉద్ఘాటించారు. దేవ్‌నీమొరీ పవిత్ర అవశేషాలు శ్రీలంకకు చేరుకోవడం రెండు దేశాల మధ్య దీర్ఘకాలంగా పెనవేసుకొన్న ఆధ్యాత్మిక బంధానికో నిదర్శనంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.
భగవాన్ బుద్ధుడు అందించిన కరుణ, శాంతి, సద్భావనల శాశ్వత సందేశం మానవులందరికీ మార్గదర్శకంగా నిలుస్తూ, సరిహద్దులకు ఆవల ఏకతనీ, స్నేహభావాన్నీ పెంపొందిస్తుందన్న ఆశాభావాన్ని ప్రధానమంత్రి వ్యక్తం చేశారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ వేర్వేరు సందేశాల్ని పొందుపరుస్తూ -
‘‘దేవ్‌నీమొరీ పవిత్ర అవశేషాలను కొలంబోలోని పావన గంగారామయా ఆలయంలో ప్రజల సందర్శనార్థం ఉంచి, ఆ ప్రదర్శనను ప్రారంభించినందుకు శ్రీలంక అధ్యక్షుడు శ్రీ అనూర కుమార దిసానాయకేకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
ఈ అవశేషాలను శ్రీలంకకు రప్పిస్తామనీ, దీంతో ఆ అవశేషాలను దర్శించుకొని శ్రద్ధాంజలి అర్పించే అవకాశం ప్రజలకు లభిస్తుందనీ నేను 2025వ సంవత్సరం ఏప్రిల్లో శ్రీలంక పర్యటనకు వచ్చిన కాలంలో ఓ నిర్ణయాన్ని తీసుకున్నాం. మన దేశాలు నాగరికత, ఆధ్యాత్మికతల పరంగా ప్రగాఢ బంధంతో ముడిపడి ఉన్నాయి. భగవాన్ బుద్ధుడు అందించిన కరుణ, శాంతి, సద్భావనల శాశ్వత సందేశం మానవాళికి మార్గదర్శకంగా నిలవాలని నేను ఆకాంక్షిస్తున్నాను”.
***
(रिलीज़ आईडी: 2223796)
आगंतुक पटल : 75
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam