పర్యటక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

డిజిటల్ పర్యాటక వేదిక

प्रविष्टि तिथि: 05 FEB 2026 3:41PM by PIB Hyderabad

దేశంలోని సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వంప్రకృతి సౌందర్యంవిభిన్న పర్యాటక ఆకర్షణలను అన్వేషించాలనుకునే పర్యాటకులుభాగస్వాముల కోసం పర్యాటక మంత్రిత్వ శాఖ ‘ఇన్‌క్రెడిబుల్ ఇండియా డిజిటల్ ప్లాట్‌ఫాం’ (ఐఐడీపీపునరుద్ధరించిన వెర్షన్‌ను ఒక సమగ్ర సాధనంగా ప్రారంభించిందిఈ కొత్త వేదిక సందర్శకులకు దేశంలోని సాంస్కృతికవారసత్వ సంపదసాహస క్రీడలుఆహార సంస్కృతిఆరోగ్య సంరక్షణకళలుచేతివృత్తులుగ్రామీణ పర్యాటకం వంటి అనేక అంశాలపై వర్చువల్ అనుభవాన్ని అందిస్తుందిఐఐడీపీ వేదిక కృత్రిమ మేధ ఆధారిత సాధనాన్ని ఉపయోగిస్తుందిఇది వాతావరణ సమాచారంనగర అన్వేషణఅవసరమైన ప్రయాణ సేవలను సమయానుకూలంగా అందిస్తూ సందర్శకుల అనుభవాన్ని వ్యక్తిగతీకరిస్తుందిడిజిటల్ సమాచారాన్ని పంచుకోవడానికినిర్వహించడానికి ఈ వేదికలో కంటెంట్ హబ్ కూడా ఉంది.

 

విమానాలుహోటళ్ళుక్యాబ్‌లుబస్సులు... సజావుగా బుక్ చేసుకునేందుకు పోర్టల్‌ పలు ఆన్‌లైన్‌ ట్రావెల్‌ ఏజెంట్లు (ఓటీఏలు), భాగస్వాములతో ఒప్పందం కుదుర్చుకుందిభారత పురావస్తు శాఖ స్మారక కట్టడాల టికెట్‌ బుకింగ్‌ సౌకర్యాన్ని కల్పించడమే కాకుండా... నమోదైన టూర్ ఆపరేటర్లుట్రావెల్ ఏజెంట్ల గురించి సమాచారాన్ని అందిస్తుందిఇందుకోసం నేషనల్ ఇంటిగ్రేటెడ్ డేటాబేస్ ఆఫ్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ (నిధిపోర్టల్‌తో కూడా అనుసంధానమై ఉంటుంది.

 

ఈ సమాచారాన్ని కేంద్ర పర్యాటకసాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ నేడు రాజ్యసభలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.

 

***


(रिलीज़ आईडी: 2224194) आगंतुक पटल : 67
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi