రక్షణ మంత్రిత్వ శాఖ
మోరన్ సమీపంలోని జాతీయ రహదారి వద్ద ప్రారంభం కానున్న ఈఎల్ఎఫ్
प्रविष्टि तिथि:
12 FEB 2026 11:03AM by PIB Hyderabad
అస్సాంలోని దిబ్రూగర్ జిల్లాలోని మోరన్ బైపాస్ ఒక చారిత్రక ఘట్టానికి వేదిక కానుంది. ఇక్కడ 2026, ఫిబ్రవరి 14న అత్యవసర ల్యాండింగ్ సౌకర్యం (ఈఎల్ఎఫ్) ప్రారంభం కానుంది. ఈశాన్య ప్రాంతంలో ఇదే మొదటి ఈఎల్ఎఫ్. దీనిని ప్రధానమంత్రి ప్రారంభించి, జాతికి అంకితం చేస్తారు. తద్వారా జాతీయ రహదారిపై గుర్తించిన నిర్దేశిత ప్రాంతం, అత్యవసర సమయాల్లో ప్రత్యామ్నాయ రన్‌వేగా అందుబాటులోకి వస్తుంది. దీనికి యుద్ధ విమానాలు, రవాణా విమానాలు, హెలికాఫ్టర్లు అత్యవసర ల్యాండింగ్, టేకాఫ్ చేయగల సామర్థ్యం ఉంది. మారుమూల ప్రాంతాల్లో మానవతా సాయం, విపత్తు ఉపశమనం (హెచ్ఏడీఆర్) కార్యకలాపాలు చేపట్టే సమయంలో కీలకంగా మారనుంది.
జాతీయ భద్రతకు సంబంధించి అత్యంత ప్రాధాన్యమున్న ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి, అస్సాం గవర్నర్, ముఖ్యమంత్రి, ఉన్నతాధికారులు, సైనిక ప్రతినిధులు పాల్గొంటారు.
***
(रिलीज़ आईडी: 2227046)
आगंतुक पटल : 53