పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆగస్టు 4, 2026న ఎయిరిండియా విమానం ఏఐ2379లో (ఫుకెట్–ఢిల్లీ) చోటు చేసుకున్న ఘటన

నాడు పోస్టు చేయడమైనది: 04 AUG 2026 7:56PM by PIB Hyderabad

థాయ్‌లాండ్‌లోని ఫుకెట్ నుంచి ఢిల్లీకి బయల్దేరిన ఎయిరిండియా విమానం ఏఐ2379 (ఎయిర్‌బస్ ఏ320, నమోదు సంఖ్య వీటీ-ఏఎక్స్‌ఓమార్గమధ్యంలో… ఆల్టిట్యూడ్ పరంగా కొద్ది సమయంపాటు హెచ్చుతగ్గులు చోటుచేసుకున్నాయిఅయితేసమస్యను సత్వరమే పరిష్కరించడంతో...సాధారణ స్థితికి వచ్చిందిఅనంతరం ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి విమానం సురక్షితంగా చేరుకుంది.

ఈ విమానంలో ముగ్గురు శిశువులతో సహా మొత్తం 137 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది (ఇద్దరు పైలట్లుఆరుగురు క్యాబిన్ సిబ్బందిఉన్నారు.

విమానం ఎయిర్ పోర్టుకు చేరుకున్న వెంటనే ముందస్తు జాగ్రత్తగా ప్రయాణికులూసిబ్బందికీ వైద్యులు పరీక్షలు నిర్వహించారుసమగ్ర వైద్య పరీక్షలుచికిత్స కోసం ఎనిమిది మంది ప్రయాణికులతో పాటు నలుగురు క్యాబిన్ సిబ్బందిని ఆసుపత్రిలో చేర్పించారుప్రస్తుతం ఆసుపత్రిలో చేరిన ప్రయాణికులుసిబ్బంది పరిస్థితి నిలకడగా ఉండగా.. వారికి వైద్యులు మెరుగైన వైద్య సంరక్షణ అందిస్తున్నారువిమానంలోని ఇతర ప్రయాణికులకు అవసరమైన సాయంమద్దతును అందించారు.

 

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి స్వయంగా ఫోర్టిస్ ఆసుపత్రికి వెళ్లారుఆయనతో పాటు పౌర విమానయాన శాఖ కార్యదర్శిడీజీసీఏ డైరెక్టర్ జనరల్ కూడా ఆసుపత్రికి వెళ్లారుగాయపడిన ప్రయాణికుల ఆరోగ్య పరిస్థితిని తెలుగుసునివారికి అవసరమైన సహాయాన్ని అందిస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారువిమానయాన మంత్రిత్వశాఖకు చెందిన సీనియర్ అధికారులు కూడా ఫోర్టిస్వేదాంత ఆసుపత్రులను సందర్శించిగాయపడిన వారికి అత్యుత్తమ వైద్య సంరక్షణసహాయం అందేలా ఆసుపత్రి యాజమాన్యాలతోవిమానయాన ప్రతినిధులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు.

 

సమస్య తలెత్తిన విమానాన్ని హ్యాంగర్‌కు తరలించారుఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను లోతుగా విశ్లేషించడం కోసం విమానంలోని ఫ్లైట్ డేటా రికార్డర్ (ఎఫ్‌డీఆర్‌), కాక్‌పిట్ వాయిస్ రికార్డర్‌ను (సీవీఆర్‌అధికారులు భద్రపరిచారు.

ఈ ఘటనపై డీజీసీఏ సమగ్ర విచారణను ప్రారంభించిందిపౌర విమానయాన మంత్రిత్వ శాఖడీజీసీఏ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాయిప్రయాణికుల భద్రతే తమ తొలి ప్రాధాన్యత అనిదీనికి సంబంధించి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు డీజీసీఏ అధికారులు స్పష్టం చేశారు.

***


(రిలీజ్ ఐడి: 2294637) సందర్శకుల సూచీ సంఖ్య : : 63
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Bengali , English , Urdu , Gujarati , Manipuri , Marathi , हिन्दी