వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
హైదరాబాద్‌లోని ఎగుమతిదారుల కోసం కస్టమ్స్ పథకాలపై కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఎఫ్ఐఈఓ
నాడు పోస్టు చేయడమైనది:
01 OCT 2026 10:20AM by PIB Hyderabad
"ఎగుమతిదారుల కోసం కస్టమ్స్ పథకాలు: ప్రయోజనాలు, విధానాలు, నిబంధనలు" పేరుతో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్ఐఈఓ) ఒక కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఐసీఐసీఐ బ్యాంకు సహకారంతో అక్టోబర్ 9, 2026 (శుక్రవారం)న హైదరాబాద్‌లో ఈ కార్యక్రమం జరుగుతుంది.
ఎగుమతిదారులు, తయారీదారులు, ఎంఎస్ఎంఈలు, వాణిజ్య భాగస్వాములకు అంతర్జాతీయ వాణిజ్యానికి అందుబాటులో ఉన్న కీలక కస్టమ్స్ పథకాలు, సులభతర చర్యలపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం లక్ష్యం. ఇందులో ముఖ్యంగా ప్రయోజనాలు, అర్హత, విధానాలు, డాక్యుమెంటేషన్, నిబంధనలు పాటించటం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తారు.
ఈ కార్యక్రమంలో కీలక అంశాలపై విస్తృతమైన చర్చలు జరుగుతాయి. అవి:
-
ఎగుమతిదారుల కోసం కస్టమ్స్ సులభతరం చేసే విధానాలపై సమీక్ష, ఎగుమతుల ప్రోత్సాహంలో కస్టమ్స్ పాత్ర, ఐస్‌గేట్, ఎలక్ట్రానిక్ కస్టమ్స్ విధానాలు, రిస్క్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, ఫేస్‌లెస్ అసెస్‌మెంట్.
-
డ్యూటీ ఫ్రీ దిగుమతి పథకాలు, అడ్వాన్స్ ఆథరైజేషన్, డ్యూటీ ఫ్రీ ఇంపోర్ట్ ఆథరైజేషన్, అర్హత, నిబంధనలు, దరఖాస్తు, డాక్యుమెంటేషన్.
-
ఎక్స్‌పోర్టు ప్రమోషన్ క్యాపిటల్ గూడ్స్ (ఈపీసీజీ) పథకంతో పాటు రాయితీ, పన్ను లేకుండా క్యాపిటల్ వస్తువుల దిగుమతి, ఎగుమతి బాధ్యతలు, విధానాలు, నిబంధనలు.
-
ప్రత్యేక కస్టమ్స్ విధానాలు, సౌలభ్యంతో పాటు బాండెడ్ తయారీ, వేర్‌హౌసింగ్, బాండ్, ఎల్‌యూటీ ద్వారా ఎగుమతులు, కస్టమ్స్ వేర్‌హౌసింగ్ నిబంధనలు.
-
అర్హత గల తయారీదారుల పథకం, ఏఈఓ, కస్టమ్స్ సౌలభ్యం, అర్హత గల తయారీదారులు, ఎగుమతిదారులకు కలిగే ప్రయోజనాలు, అనుసరించాల్సిన విధానాలు.
-
ఎగుమతిదారుల కోసం కస్టమ్స్ సౌలభ్యం, షిప్పింగ్ బిల్లు, సపోర్టింగ్ డాక్యుమెంట్లు, వర్గీకరణ, వాల్యుయేషన్, దేశీయ అవసరాలు, రికార్డుల నిర్వహణ, ఆడిట్, సాధారణ తప్పులు, జరిమానాలు.
-
డిజిటల్ కస్టమ్స్, ఐస్‌గేట్ సేవలు, ఇంటరాక్టివ్ ప్రశ్నలు-సమాధానాలు, కేస్‌స్టడీస్.
ఈ అంశాలపై హైదరాబాద్ కస్టమ్స్ కమిషనరేట్ సీనియర్ అధికారులు సమగ్రంగా ప్రజెంటేషన్లు ఇస్తారు. కస్టమ్స్ విధానాలు, నిబంధనలకు సంబంధించి ఆచరణాత్మక సమస్యల పరిష్కారంపై చర్చలు జరుగుతాయి. ఈ కార్యక్రమంలో బ్యాంకు అధికారులు కూడా పాల్గొని ఆర్థిక అవకాశాల గురించి వివరిస్తారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనేవారికి కస్టమ్స్ పథకాలపై ఆచరణాత్మక అవగాహనను కల్పిస్తామని ఎఫ్ఐఈఓ డైరెక్టర్ జనరల్ శ్రీ ఉన్నికృష్ణన్ తెలిపారు. అందుబాటులో ఉన్న సదుపాయాలను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు అవసరమైన విధానాలు, డాక్యుమెంటేషన్ గురించి స్పష్టమైన అవగాహన ఏర్పడుతుందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు మరిన్ని వివరాల కోసం సంప్రదించవచ్చు:
శ్రీ ఆర్. కులకర్ణి, హెడ్ - తెలంగాణ చాప్టర్
ఫోన్ నంబర్: 9848286640, ఈ-మెయిల్: kulkarni@fieo.org
ఎఫ్ఐఈఓ గురించి
వాణిజ్య మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో 1965లో ఏర్పాటైన ఎఫ్ఐఈఓ ఎగుమతిదారుల అత్యుత్తమ సంస్థ. భారత్‌లో ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందిన ఎగుమతి ప్రోత్సాహక మండళ్లు, కమోడిటీ బోర్డులు, అభివృద్ధి ప్రాధికార సంస్థలకు ఉన్నత సంస్థగా వ్యవహరిస్తుంది. మార్కెట్ పరిశోధన, వాణిజ్య సమాచారం, ఎగుమతి ప్రోత్సాహక కార్యకలాపాలు, విదేశీ వాణిజ్య ప్రదర్శనలు, ఎగ్జిబిషన్ల నిర్వహణ, శిక్షణా కార్యక్రమాలు, విధానపరమైన సిఫార్సులు వంటి ఎన్నో సేవలను ఎగుమతిదారులకు ఎఫ్ఐఈఓ అందిస్తుంది.
****
(రిలీజ్ ఐడి: 2317571)
సందర్శకుల సూచీ సంఖ్య : : 71