బొగ్గు మంత్రిత్వ శాఖ
'స్పెషల్ క్యాంపెయిన్-6'లో భాగంగా ఇ-వ్యర్థాల నిర్వహణపై దృష్టి సారిస్తూ ప్రత్యేక కార్యక్రమం చేపట్టిన బొగ్గు మంత్రిత్వశాఖ
నాడు పోస్టు చేయడమైనది:
06 OCT 2026 6:31PM by PIB Hyderabad
స్పెషల్ క్యాంపెయిన్-6కి సంబంధించి పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం (డీఏఆర్‌పీజీ) మార్గదర్శకాలకు అనుగుణంగా... బొగ్గు మంత్రిత్వ శాఖ ఈ నెల 6న అన్ని కోల్‌ఫీల్డ్ కార్యాలయాల్లో ఇ-వ్యర్థాల నిర్వహణపై దృష్టి సారిస్తూ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించింది. 74 ఫీల్డ్ ఆఫీసుల్లోని 2152 మంది ఉద్యోగులు ఈ ప్రత్యేక డ్రైవ్‌లో పాల్గొన్నారు.
మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి అధ్యక్షతన "ఇ-వ్యర్థాల నిర్వహణ"పై ఒకరోజు కార్యశాల హైబ్రిడ్ విధానం ద్వారా బొగ్గు మంత్రిత్వశాఖ సమావేశ మందిరంలో జరిగింది. సైంటిస్ట్-బి, సీబీసీబీ, ఎంవోఈఎఫ్‌సీసీ శ్రీమతి రియా సోనీ... బాధ్యతాయుతమైన ఇ-వ్యర్థాల హ్యాండ్లింగ్, నిర్వహణకు సంబంధించిన కీలక అంశాలను కవర్ చేస్తూ ఇ-వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన ప్రెజెంటేషన్ అందించారు.
ఎలక్ట్రానిక్ వ్యర్థాలను (ఇ-వ్యర్థాలను) క్రమపద్ధతిలో వేరు చేయడం, సరైన విధంగా డిస్పోజ్ చేయడం గురించి బొగ్గు మంత్రిత్వ శాఖ, దాని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల (సీపీఎస్ఈల) అధికారులకు అవగాహన కల్పించడమే ఈ కార్యశాల లక్ష్యం.
ఈ కార్యశాలకు మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారులు స్వయంగా హాజరుకాగా... కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్), దాని అనుబంధ సంస్థలు, ఎన్ఎల్‌సీ ఇండియా లిమిటెడ్, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్, కోల్ కంట్రోలర్స్ ఆర్గనైజేషన్, కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌లకు చెందిన అధికారులు వీడియో అనుసంధానం ద్వారా పాల్గొన్నారు.
సీసీవోలో క్విజ్ పోటీ:
ఢిల్లీలోని కోల్ కంట్రోలర్స్ ఆర్గనైజేషన్ (సీసీవో) కార్యాలయంలో 'ఇ-వ్యర్థాల నిర్వహణ' అంశంపై క్విజ్ పోటీని నిర్వహించారు.
ఇ-వ్యర్థాల కియోస్క్:
స్పెషల్ క్యాంపెయిన్-6 ప్రధాన ఇతివృత్తానికి అనుగుణంగా... క్షేత్ర స్థాయిలో ఎలక్ట్రానిక్ వ్యర్థాలను క్రమపద్ధతిలో సేకరించడం, వేరు చేయడం, బాధ్యతాయుతంగా డిస్పోజ్ చేయడాన్ని సులభతరం చేయడం కోసం వివిధ క్షేత్ర కార్యాలయాల్లో ఇ-వ్యర్థాల సేకరణ వర్క్‌స్టేషన్‌లను (ఇ-వ్యర్థాల కియోస్క్‌లు) ఏర్పాటు చేశారు.
***
(రిలీజ్ ఐడి: 2319889)
సందర్శకుల సూచీ సంఖ్య : : 11