ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆర్ఐఎన్ఎల్ భూముల ఇ-వేలానికి ముందు మాక్ ఇ-వేలం ద్వారా శిక్షణ నిర్వహించిన ఎన్ఎల్ఎంసీ

93,572.21 చదరపు గజాల విస్తీర్ణం కలిగిన 459 ఆర్ఐఎన్ఎల్ ప్లాట్ల కోసం ఈ నెల 12, 16 తేదీల్లో వేలం

మొదటి వేలం కోసం రిజిస్ట్రేషన్, ఈఎండీ సమర్పణకు ఈ నెల 8న సాయంత్రం 5గంటల వరకు గడువు

నాడు పోస్టు చేయడమైనది: 07 OCT 2026 6:03PM by PIB Hyderabad

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్పొరేట్ సంస్థ అయిన రాష్ట్రీయ ఇస్పత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్)కు చెందిన 459 ప్లాట్ల ఇ-వేలానికి ముందు... బిడ్డర్లకు ఆన్‌లైన్ బిడ్డింగ్ ప్రక్రియపై అవగాహన కల్పించారు. భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థల విభాగం (డీపీఈ) ఆధ్వర్యంలోని నేషనల్ ల్యాండ్ మోనెటైజేషన్ కార్పొరేషన్ (ఎన్ఎల్ఎంసీ) ఈ నెల 6న విశాఖపట్నంలో ఒక భౌతిక నమూనా ఇ-వేలం ప్లాట్‌ఫారమ్ శిక్షణను నిర్వహించింది.

 

ఆసక్తిగల బిడ్డర్లకు, ఇతర భాగస్వాములకు అనుకరణ విధానంలో ఇ-వేలం ప్లాట్‌ఫామ్‌ను గురించి పూర్తి అవగాహన కలిగించడం కోసం ఈ ప్రత్యక్ష శిక్షణను నిర్వహించారు. ఈ సెషన్‌లలో బిడ్డింగ్ ఇంటర్‌ఫేస్, పాల్గొనే విధానం, ఆన్‌లైన్ వేలం ప్రక్రియ సంబంధిత ఇతర కీలక అంశాలనూ వివరించారు. ప్రత్యక్ష వేలానికి ముందు... వేలంలో పాల్గొనాలనుకునే వారు ఈ ప్లాట్‌ఫామ్‌ ద్వారా ఆచరణాత్మక అవగాహనను పొందగలిగారు.

 

ప్రత్యక్ష శిక్షణ కార్యక్రమానికి హాజరుకాలేకపోయిన ఆసక్తి గల బిడ్డర్లు ఈ శిక్షణలో పాల్గొనేందుకు వీలుగా... ఈ రోజు ఎన్ఎల్ఎంసీ ఆన్‌లైన్ మాక్ ఇ-వేలం ప్లాట్‌ఫారమ్ శిక్షణనూ నిర్వహించింది. ఈ నెల 12, 16 తేదీల్లో జరగనున్న ప్రత్యక్ష వేలం ప్రక్రియకు ముందే... వేలంలో పాల్గొనాలనుకునే వారు డిజిటల్ బిడ్డింగ్ విధానంపై అవగాహన పొందే అవకాశాన్ని ఈ ఆన్‌లైన్ సెషన్ కల్పించింది.

 

ఆర్ఐఎన్ఎల్ భూములకు సంబంధించిన రెండు దశల ఇ-వేలం ప్రక్రియకు కొద్ది రోజుల ముందు ఈ మాక్ ఇ-వేలం కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మొదటి దశ వేలం ఈ నెల 12న ఉదయం 11:00 గంటల నుంచి సాయంత్రం 7:00 గంటల వరకు... రెండో దశ వేలం ఈ నెల 16న ఉదయం 11:00 గంటల నుంచి సాయంత్రం 7:00 గంటల వరకు నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమంలో ఎన్ఎల్ఎంసీ సీఈవో శ్రీ రోహన్ చంద్ ఠాకూర్ మాట్లాడుతూ... ప్రత్యక్ష వేలానికి ముందు ఆసక్తి గల బిడ్డర్లు డిజిటల్ బిడ్డింగ్ ప్రక్రియ గురించి పూర్తి అవగాహన పొందేలా భౌతిక, ఆన్‌లైన్ మాక్ ఇ-వేలం సెషన్‌లను నిర్వహించడం కీలక ముందడుగని పేర్కొన్నారు. ఆసక్తి గల బిడ్డర్లకు ప్లాట్‌ఫారమ్‌ను అర్థం చేసుకోవడానికి, నిర్దేశిత కాలపరిమితుల్లో అవసరమైన లాంఛనాలను పూర్తి చేయడానికి తగిన అవకాశాన్ని కల్పిస్తూ... వేలం ప్రక్రియను మరింత పారదర్శకంగా, అందుబాటులో ఉండేలా, పాల్గొనేవారికి అనుకూలంగా మార్చడమే మా ప్రయత్నం అని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్ఐఎన్ఎల్ భూముల వేలం ఒక ముఖ్యమైన అసెట్ మోనెటైజేషన్ అవకాశాన్ని అందిస్తుందన్నారు. ప్రొఫెషనల్, పారదర్శక, నిర్మాణాత్మక విధానంలో ఈ ప్రక్రియను సులభతరం చేయడానికి ఎన్ఎల్ఎంసీ కట్టుబడి ఉందని శ్రీ రోహన్ ఠాకూర్ తెలిపారు.

 

93,572.21 చదరపు గజాల విస్తీర్ణంలో 459 ప్లాట్లు

 

ఆర్ఐఎన్ఎల్ భూముల జాబితాలో విశాఖపట్నంలోని హెచ్‌బీ కాలనీ... మద్దిలపాలెం, గాజువాకలోని ఆటో నగర్ వంటి ప్రాంతాల్లో... మొత్తం 93,572.21 చదరపు గజాల విస్తీర్ణం కలిగిన 459 అత్యుత్తమ శ్రేణి (ప్రీమియం), ఎటువంటి చట్టపరమైన వివాదాలు లేని ప్లాట్లు ఉన్నాయి.  

 

ఈ ప్లాట్ల విస్తీర్ణం సుమారు 128.94 చదరపు గజాల నుంచి 2,728 చదరపు గజాల వరకు ఉంటుంది. దీనివల్ల ఆయా ప్రాంతాల్లో కొనుగోలుదారులకు అనేక రకాల ఎంపికలు లభిస్తాయి.

 

రైల్‌టెల్ ఇ-నివిడియా ఇ-ప్రొక్యూర్‌మెంట్ ప్లాట్‌ఫారమ్ ద్వారా పారదర్శకమైన, పోటీతత్వంతో కూడిన ఇ-టెండర్-కమ్-ఇ-వేలం ప్రక్రియతో ఈ ప్రాపర్టీలను కేటాయిస్తారు. ఈ ప్రక్రియకు క్వికర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (క్యూఐపీఎల్) ట్రాన్సాక్షన్ కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తోంది.

 

వేల కోసం ముఖ్యమైన తేదీలు

 

Particulars

 

Day 1

 

Day 2

 

Number of plots

 

243

 

216

 

Auction Date

 

October 12, 2026

 

October 16, 2026

 

Auction Timing

 

11:00 AM – 7:00 PM

 

11:00 AM – 7:00 PM

 

Last date for Registration & EMD

 

October 8, 2026, 5:00 PM

 

October 14, 2026, 5:00 PM

 

EMD

 

₹2 lakh per plot

 

₹2 lakh per plot

 

 

ఆసక్తి ఉన్న బిడ్డర్లు ఈ నెల 12న జరిగే వేలం మొదటి దశలో పాల్గొనడానికి... రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసి, నిర్దేశిత నిబంధనలకు అనుగుణంగా ఈ నెల 8న సాయంత్రం 5:00 గంటల్లోపు ఈఎండీని సమర్పించాల్సి ఉంటుంది.

 

అక్టోబర్ 16న జరగనున్న రెండో దశకు సంబంధించి... రిజిస్ట్రేషన్, ఈఎండీ సమర్పణకు ఈ నెల 14న సాయంత్రం 5:00 గంటల వరకు గడువు నిర్ణయించారు.   

 

మూడు నగరాల్లో పెట్టుబడిదారులతో సంప్రదింపులు

 

వేలానికి ముందు... విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్‌ నగరాల్లో పెట్టుబడిదారులతో ఎన్ఎల్ఎంసీ సమావేశాలను నిర్వహించింది. ఆసక్తి గల కొనుగోలుదారులు, ఇతర సంబంధిత వర్గాలు... భూమి వివరాలు, వేలం ప్రక్రియ, అర్హత ప్రమాణాలు, సంబంధిత విధానాల గురించి సమగ్ర సమాచారాన్ని పొందే అవకాశం లభించింది.

 

పెట్టుబడిదారులతో సమావేశాల్లో... స్థానికేతరులు, విదేశాల్లో ఉన్న ఆసక్తి గల కొనుగోలుదారులూ భౌతిక, వీడియో అనుసంధానం ద్వారా పాల్గొన్నారు. ఆసక్తి గల బిడ్డర్‌లకు డిజిటల్ బిడ్డింగ్ ప్లాట్‌ఫారమ్‌పై ఆచరణాత్మక అనుభవాన్ని అందించడం ద్వారా భౌతిక, ఆన్‌లైన్ మాక్ ఇ-వేలం సెషన్‌లు ఈ ప్రచారాన్ని మరింత బలోపేతం చేశాయి.

 

ప్రత్యక్ష వేలానికి ముందు విస్తృత యాక్సెస్ కల్పించడం, ఆసక్తి గల బిడ్డర్లను మరింతగా సిద్ధం చేయడం లక్ష్యంగా... విశాఖపట్నంలో ఈ నెల 6న ప్రత్యక్ష శిక్షణ, ఈ నెల 7న ఆన్‌లైన్ శిక్షణతో రెండు దశల నమూనా శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.

 

పారదర్శకమైన, వ్యవస్థాగతమైన ప్రక్రియల ద్వారా తక్కువ వినియోగంలో ఉన్న ఆస్తుల విలువ నుంచి సాధ్యమైనంత ఎక్కువ ఆర్థిక ప్రయోజనం పొందాలనే ప్రభుత్వ విస్తృత లక్ష్యంలో భాగంగా... కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు (సీపీఎస్ఈలు), ప్రభుత్వ ఏజెన్సీల వద్ద ఉన్న అదనపు భూములు, ప్రధాన కార్యకలాపాలకు సంబంధం లేని ఆస్తుల నగదీకరణకు ఎన్ఎల్ఎంసీ కృషి చేస్తోంది.

ఆసక్తి గల బిడ్డర్లు ఆర్ఐఎన్ఎల్ భూముల ఇ-వేలంకు సంబంధించిన ప్లాట్ వివరాలు, వేలం షెడ్యూల్, అర్హత ప్రమాణాలు, నిబంధనలు, షరతులు, రిజిస్ట్రేషన్ అవసరాలు, బిడ్డింగ్ ప్రక్రియ సహా వివరణాత్మక సమాచారాన్ని అధికారిక ఇ-వేలం పోర్టల్‌లో పొందవచ్చు:

 

ఇ-వేలం పోర్టల్: https://eauction.enivida.com/

 

ఎన్ఎల్ఎంసీ గురించి

 

నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ (ఎన్ఎల్ఎంసీ)... ఆర్థిక మంత్రిత్వ శాఖలోని పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ విభాగ పరిపాలనా నియంత్రణలో ఉన్న భారత ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థ. నిర్మాణాత్మక, ప్రొఫెషనల్ విధాన ప్రణాళిక ద్వారా సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్, ఇతర ప్రభుత్వ ఏజెన్సీల మిగులు భూములు, నాన్-కోర్ ఆస్తుల మోనెటైజేషన్ కోసం ఎన్ఎల్ఎంసీ వీలు కల్పిస్తుంది.

 

ఆర్ఐఎన్ఎల్ గురించి

 

విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి చెందిన కార్పొరేట్ సంస్థ అయిన 'రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్' (ఆర్ఐఎన్ఎల్)... భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వ శాఖ పరిధిలోని కేంద్ర ప్రభుత్వ రంగ 'నవరత్న' సంస్థగా ఉంది.


(రిలీజ్ ఐడి: 2320413) సందర్శకుల సూచీ సంఖ్య : : 9
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Assamese