ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రభుత్వ అధినేతగా 25 ఏళ్ల సేవను పూర్తి చేసిన సందర్భంగా తనకు డొమినికా ప్రధాని రూజ్‌వెల్ట్ స్కెరిట్‌ తెలిపిన శుభాకాంక్షలకు కృతజ్ఞతలు చెప్పిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

నాడు పోస్టు చేయడమైనది: 07 OCT 2026 8:49PM by PIB Hyderabad

డొమినికా ప్రధానమంత్రి రూజ్‌వెల్ట్ స్కెరిట్‌ తనకు పంపిన హృదయపూర్వక శుభాకాంక్షలు, ఆలోచనాత్మకమైన సందేశానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. డొమినికాతో భారత్‌కు ఉన్న చిరకాల స్నేహాన్ని ఎంతో విలువైనదిగా భావిస్తున్నామని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు, రెండు దేశాల ప్రజల ఉమ్మడి ప్రగతి, శ్రేయస్సు కోసం కలిసి పనిచేయడానికి తాను కట్టుబడి ఉన్నట్లు ప్రధానమంత్రి తెలిపారు.

 

 

 

సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.

 

 

 

‘‘ప్రధానమంత్రి స్కెరిట్‌ గారూ.. మీ హృదయపూర్వక శుభాకాంక్షలు, ఆలోచనాత్మకమైన సందేశానికి ధన్యవాదాలు. డొమినికాతో భారత్‌కు ఉన్న చిరకాల స్నేహాన్ని ఎంతో విలువైనదిగా భావిస్తున్నాం. ఇరు దేశాల ప్రజల ఉమ్మడి ప్రగతి, సుసంపన్నత కోసం కలిసి పనిచేస్తూ, మన భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఎదురుచూస్తున్నాం’’.


(రిలీజ్ ఐడి: 2320468) సందర్శకుల సూచీ సంఖ్య : : 9
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Marathi , हिन्दी , Assamese , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam