ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రభుత్వాధినేతగా దేశ సేవలో 25 సంవత్సరాలను పూర్తి చేసుకున్న సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలిపిన సెర్బియా అధ్యక్షుడు అలెగ్జాండర్ వుచిచ్‌కు ధన్యవాదాలు తెలిపిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
07 OCT 2026 9:10PM by PIB Hyderabad
ఆప్యాయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసిన సెర్బియా అధ్యక్షుడు అలెగ్జాండర్ వుచిచ్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలియజేశారు. భారత్-సెర్బియా భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో సెర్బియా అధ్యక్షుడు వ్యక్తిగతంగా అందిస్తున్న సహకారాన్ని తాను ఎంతో అభినందిస్తున్నట్లు ఈ సందర్భంగా శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధాని ఈ విధంగా పేర్కొన్నారు:
"మీ హృదయపూర్వక మాటలకు, స్నేహభావానికి ధన్యవాదాలు.
భారత్-సెర్బియా భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో మీ వ్యక్తిగత సహకారాన్ని నేను ఎంతో అభినందిస్తున్నాను.
మీ నాయకత్వంలో సెర్బియా అసాధారణ పరివర్తనను సాధించింది. మీరు దృఢ నిశ్చయం, అంకితభావంతో సెర్బియాకు సేవచేశారు.
భారత్-సెర్బియా భాగస్వామ్యాన్ని మరింత అత్యున్నత శిఖరాలకు చేర్చడానికి నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను."
(రిలీజ్ ఐడి: 2320504)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam