ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఎదుటివారిని గౌరవించడం, వినయంతో ఉండటం... సద్గుణాలు అని చెబుతున్న సంస్కృత సుభాషితం.. ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 09 OCT 2026 9:26AM by PIB Hyderabad

ఇతరులను గౌరవించడం, వినయపూర్వక ప్రవర్తన సద్గుణాలు అని బోధిస్తున్న ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు.

ఆ సుభాషితం ఇలా ఉంది:

‘‘వత్సరాజోపి తం ప్రాప్తం ప్రదత్తోపాయనం నృపమ్

ప్రీత్యా సమ్మానయామాస శూరా హి ప్రణతిప్రియాః’’.

పరులను గౌరవ పూర్వకంగా స్వాగతించడం, మన దగ్గరకు వచ్చిన వారిని వినయపూర్వకంగా ఆదరించి, వారితో ఆప్యాయంగా మెలగడం ఉత్తమ సంప్రదాయమని ఈ శ్లోకం స్పష్టం చేస్తోంది.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:

‘‘వత్సరాజోపి తం ప్రాప్తం ప్రదత్తోపాయనం నృపమ్

ప్రీత్యా సమ్మానయామాస శూరా హి ప్రణతిప్రియాః’’ అని పేర్కొన్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2321189) సందర్శకుల సూచీ సంఖ్య : : 11