బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అక్టోబర్‌లో విద్యుత్ కేంద్రాలకు వేగంగా బొగ్గు సరఫరా

నాడు పోస్టు చేయడమైనది: 09 OCT 2026 10:54AM by PIB Hyderabad

విద్యుత్ ప్లాంట్ల వద్ద బొగ్గు నిల్వలు కనిష్ఠ స్థాయులకు పడిపోవడంతో భారతదేశంలో విద్యుత్ కొరత ఏర్పడే ప్రమాదం పెరుగుతోందంటూ ఇటీవలి కాలంలో మీడియా కథనాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో బొగ్గు మంత్రిత్వ దిగువ పేర్కొన్న విషయాలను స్పష్టం చేస్తోంది.

 

‘‘క్రిటికల్ స్టాక్’’ అనే ట్యాగ్ ప్రమాణ ఆధారితమైన సూచిక (నిర్దేశించిన ప్రామాణిక నిల్వ పరిమితి కంటే తక్కువ నిల్వను కలిగి ఉండటం). అయితే వాస్తవ ఇంధన కొరత లేదా ఉత్పత్తి నష్టం ఏర్పడటానికి చాలా ముందుగానే విద్యుత్ కేంద్రాలను హెచ్చరించడానికి ఈ విధానాన్ని రూపొందించారు. దీని ప్రకారం, ఈ జాబితాలో ఏదైనా విద్యుత్ కేంద్రం పేరు కనిపిస్తే.. అది ముందస్తు హెచ్చరిక మాత్రమే. ఆ కేంద్రంలో బొగ్గు అయిపోయిందని లేదా తక్షణమే మూసివేత ప్రమాదంలో ఉందని సూచించే సంకేతం ఏమాత్రం కాదు.

 

సెప్టెంబర్‌లో సరఫరాలు కనిష్ట స్థాయికి పడిపోయిన తర్వాత ఎంతమేరకు మెరుగుపడ్డాయనే అంశాన్ని పరిగణనలోకి తీసుకుని బొగ్గు నిల్వల పరిస్థితిని అంచనా వేయాలి. సెప్టెంబరులో నమోదయిన కనిష్ట స్థాయిలతో పోలిస్తే విద్యుత్ రంగానికి రోజువారీ సరఫరాలు దాదాపు 36 శాతం పెరిగాయి. అలాగే సెప్టెంబర్‌తో పోలిస్తే అక్టోబర్ సగటు సరఫరా సుమారు 9 శాతం ఎక్కువగా నమోదైంది. నిల్వలు తరిగిపోయే వేగం కూడా గణనీయంగా మందగించింది (చిత్రం 1). దీనికి అనుగుణంగా రైలు లోడింగ్ వేగం పుంజుకుంది. అక్టోబర్‌లో రోజుకు సగటున 465 ర్యాక్‌లకు పైగా లోడింగ్ జరిగింది. వరుసగా మూడు రోజుల్లోనే నిర్దేశిత 470 ర్యాక్‌ల లక్ష్యాన్ని చేరుకున్నారు (చిత్రం 2). రోడ్డు మార్గంతో సహా ఇతర రవాణా మార్గాల ద్వారా కూడా బొగ్గు సరఫరా మెరుగయింది. 

చిత్రం 1: డీసీబీ ప్లాంట్లలో తరుగుదల/వృద్ధి (మెట్రిక్ టన్నుల్లో)

చిత్రం 2: ర్యాక్ లోడింగ్ ట్రెండ్ 2026 అక్టోబర్

నిల్వలు తరిగిపోయే వేగం గణనీయంగా తగ్గింది. రోజువారీ నిల్వల వినియోగం సెప్టెంబర్‌లో రోజుకు 0.243 మిలియన్ టన్నులు ఉండగా, అక్టోబర్‌లో అది రోజుకు 0.116 మిలియన్ టన్నులకు, అంటే సగానికి పైగా తగ్గింది. నిల్వల పునరుద్ధరణ ప్రక్రియ ఇంకా ప్రారంభం కానప్పటికీ, పరిస్థితి నిలకడగా మారుతోంది. 

 

బొగ్గు నిల్వలు క్లిష్టమైన స్థాయి పడిపోయిన విద్యుత్ కేంద్రాల పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తికి ఎలాంటి అంతరాయం కలగకుండా తగినంత సరఫరా జరిగేలా, నిల్వలు తక్కువగా ఉన్న కేంద్రాలకు వాటి అవసరాలకు తగినట్లుగా బొగ్గును పునఃపంపిణీ చేస్తున్నారు. వర్షాకాలం చివరి దశకు చేరుకోవడం, అక్టోబర్ మధ్యమం నాటికి గరిష్ఠ విద్యుత్ డిమాండ్ తగ్గుముఖం పట్టే అవకాశం ఉండటంతో (మునుపటి ధోరణుల ప్రకారం) రోజుకు 465 నుంచి 475 ర్యాక్‌ల చొప్పున లోడింగ్‌ను కొనసాగించడం వల్ల పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. అలాగే రానున్న పండుగలు, శీతాకాలం, ఆ తర్వాత వచ్చే వేసవి డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ముందుగానే బొగ్గు నిల్వలను తిరిగి సమకూర్చుకోవడానికి వీలు కల్పిస్తుంది ఫలితంగా క్రిటికల్ విభాగంలో ఉన్న కేంద్రాల సంఖ్య తగ్గుతుంది. 

 

దేశంలో ఎక్కడా విద్యుత్ ఉత్పత్తికి బొగ్గు సరఫరా వల్ల ఆటంకం ఎదురవకుండా ఉండేందుకు రైల్వే మంత్రిత్వశాఖ, విద్యుత్ మంత్రిత్వశాఖల సమన్వయంతో సరఫరాలు, రవాణాను బొగ్గు మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తోంది.

 

****

 

 


(రిలీజ్ ఐడి: 2321339) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Bengali , English , Urdu , हिन्दी , Marathi , Assamese , Punjabi , Tamil